బాహుబలి తరువాతే నమ్మకం పెరిగింది

బాహుబలి ముందు వరకు తనకు డెస్టినీ మీద నమ్మకం లేదని, అప్పటి నుంచే డెస్టినీని నమ్మడం మొదలుపెట్టాను అని హీరో ప్రభాస్ అన్నారు. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ ల్లో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి…

బాహుబలి ముందు వరకు తనకు డెస్టినీ మీద నమ్మకం లేదని, అప్పటి నుంచే డెస్టినీని నమ్మడం మొదలుపెట్టాను అని హీరో ప్రభాస్ అన్నారు. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ ల్లో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి హీరో ప్రభాస్ ను ఇంటర్వూ చేసారు. ఈ సందర్బంగా ప్రభాస్ నమ్మకాల గురించి మాట్లాడారు. 

బాహుబలి తన దగ్గర కు రాకముందు తనకు డెస్టినీ అంటే నమ్మకం లేదన్నారు. అప్పటి నుంచి నమ్మడం ప్రారంభించా అన్నారు. తన ఫ్రెండ్స్, కంగనా వంటి హీరోయిన్ల విషయంలో జ‌రిగిన సంఘటనలు తనను డెస్టినీని నమ్మేలా ప్రోత్సహించాయని ప్రభాస్ అన్నారు. 

బాహుబలి తరువాత తనతో కేవలం లవ్ స్టోరీ చేయడం అంత ఈజీ కాదని, యాక్షన్ లవ్ స్టోరీ అంటే అది వేరు అని, నిజానికి ఫైట్లు క్రియేట్ చేయడానికి చాన్స్ వుందని, కానీ డైరక్టర్ పూర్తిగా ఇలాంటి జానర్ ను పట్టుబట్టి రూపొందించారన్నారు.

సినిమాలో సంచారి సాంగ్ తనకు బాగా నచ్చిందని రాజ‌మౌళి అన్నారు. ఆ పాటలో ప్రభాస్ నవ్వు తనకు బాగా నచ్చిందన్నారు. రాజ‌మౌళి నుంచి ఆయన సినిమాల నుంచి పదిహేనేళ్ల కాలంగా చాలా నేర్చుకున్నా అని, ఆ పాయింట్లు అన్నీ తనతో పని చేసేని ప్రతి డైరక్టర్ కు చెప్పానని ప్రభాస్ అన్నారు.

ఆర్ఆర్ఆర్..రాధేశ్యామ్ సినిమాలు రెండూ ఓ దశలో ఒకే సెట్ లో మధ్యలో తెరకట్టి షూట్ చేయడం మరిచిపోలేని అనుభవం అని ఇద్దరూ గుర్తు చేసుకున్నారు.

తనను ఆర్ఆర్ఆర్ లో గెస్ట్ రోల్ లో అయినా చూపించాలని అనుకోలేదా? అని ప్రభాస్ అడగడం విశేషం.