ఇండియాలోనే బిగ్ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ఆర్. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే టైమ్ లో షూటింగ్ జరుపుకున్నాయి. అయితే ఒకే సెట్ లో షూట్ చేశారనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం రాధేశ్యామ్ సెట్ ను వాడుకున్నారనే విషయం ఆ సినిమా యూనిట్ కు మాత్రమే తెలుసు. ఈ ఆసక్తికర విషయాన్ని ప్రభాస్ బయటపెట్టాడు.
“రాధేశ్యామ్ లో మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. అన్నపూర్ణలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడే రాజమౌళికి కూడా ఆర్ఆర్ఆర్ సెటప్ ఉంది. కానీ ఆరోజు ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ఖాళీ లేదు. వేరే సీన్స్ తీస్తున్నట్టున్నారు. అప్పుడు నాకు కార్తికేయ ఫోన్ చేశాడు. అన్న.. మీ సెటప్ లో ఆర్ఆర్ఆర్ కోసం అలియా భట్ తో చిన్న బ్లాక్ ఉంది చేద్దాం అని కోరాడు.
నేను వెంటనే ఓకే చెప్పాను. అలా మా సెట్ లో సగం రాజమౌళి తీసుకొని అలియాభట్ సీన్ తీశారు. ఓవైపు రాధేశ్యామ్ కోసం దర్శకుడు రాధాకృష్ణ యాక్షన్ అని చెప్పడం, ఆ పక్కనే ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి యాక్షన్ అని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది.”
అన్నపూర్ణ స్టుడియోస్ లోని ఓ భారీ ఫ్లోర్ లో ఆ రోజు మధ్యలో ఓ పెద్ద తెర కట్టారు. ఓవైపు ఆర్ఆర్ఆర్, మరోవైపు రాధేశ్యామ్ షూట్ చేశారు. ఇటు రాజమౌళి యాక్షన్ అని అరవడం, అటు రాధాకృష్ణ యాక్షన్ అని చెప్పడం.. ఇలా ఒకే సెట్ లో ఈ రెండు జరగడం తనకు మంచి అనుభూతి అని చెప్పుకొచ్చాడు ప్రభాస్.
కట్ చేస్తే, ఇప్పుడు అదే రాజమౌళి, రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ కు వచ్చాడు. సినిమాకు సంబంధించి ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేశాడు. రాధేశ్యామ్ లో షిప్ ఎపిసోడ్, జక్కన్నకు బాగా నచ్చిందంట.