Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలకృష్ణకు దిల్ రాజు పార్టీ

బాలకృష్ణకు దిల్ రాజు పార్టీ

హీరో దిల్ రాజు టాలీవుడ్ లో అందరివాడు. అందరు హీరోలు, అన్ని రాజకీయ పార్టీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. అటు పవన్ తో చెట్టాపట్టాలేసుకుంటారు. 

ఇటు బాలయ్యతో భాయి..భాయీ అనగలరు. మహేష్ అయినా, బన్నీ అయినా అందరూ ఆయన హీరోలే. అన్ని సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆయనదే.

లేటెస్ట్ గా అఖండ సినిమాను నైజాం, వైజాగ్ ఏరియాలకు పంపిణీ చేసారు. లాభాలు కళ్ల చూడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హీరో బాలకృష్ణకు ఓ మాంచి పార్టీ అరేంజ్ చేసారు. 

సోమవారం రాత్రి దిల్ రాజు, ఆయన సన్నిహితులు, బాలయ్య, ఆయన సన్నిహితుల నడుమ ఈ పార్టీ జరుగుతుందని తెలుస్తోంది.

బాలయ్యతో సినిమా చేయాలన్న కోరిక దిల్ రాజుకు ఎప్పటి నుంచో వుంది. వకీల్ సాబ్ ముందు ఆయన దగ్గరకే వెళ్లింది కానీ ప్రాజెక్టు సెట్ కాలేదు. 

ఇప్పుడు ఈ ఊపులో దిల్ రాజు-బాలయ్య ప్రాజెక్టు సెట్ అయ్యేలా వుంది. వేణు శ్రీరామ్ రెడీగా వుండనే వున్నారు. కానీ బాలయ్య చేతిలో ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలు వున్నాయి. అవి పూర్తి కావాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?