పుష్ప ట్రయిలర్ విడుదలవుతున్న తరుణం ఇది. ఇలాంటి టైమ్ లో బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే 15 శాతం సేల్ రేటు తగ్గించారు.
గతంలో ఆంధ్రకు 60 కోట్లకు విక్రయించారు. కానీ టికెట్ రేట్ల వ్యవహారం రావడంతో రేట్ తగ్గిస్తారా..తగ్గించరా అని వార్తలు వినిపించడం ప్రారంభమైంది. పెద్ద బ్యానర్, రెగ్యులర్ బయ్యర్లు, కావడంతో తగ్గించడంపై నిర్మాతలు స్టబర్న్ గా వున్నారని వార్తలు వినిపించాయి.
అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే పుష్ప డిస్ట్రిబ్యూషన్ రేట్లు ఆంధ్ర, సీడెడ్ తగ్గించారు.15శాతం కట్ చేసారు. అంతే కాదు, అవసరం అయితే జీఎస్టీ అడ్జస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ఆంధ్ర 60 కోట్లకు ఇచ్చారు. ఇప్పుడు 51 కోట్లకు ఇచ్చినట్లు అయింది. గతంలో వుండిపోయిన గుంటూరు ఏరియాను కూడా అదే రేషియోలో మెట్రో సురేష్ కు ఇచ్చేసారు.
సీడెడ్ ను 18 కోట్లకు ఫిక్స్ చేసారు. మొత్తం మీద టికెట్ రేట్ల వల్ల పుష్పకు జరిగిన డ్యామేజ్ దాదాపు 13 కోట్లకు పైగానే అన్నమాట. సినిమా బ్లాక్ బస్టర్ అయితే, ఓవర్ ఫ్లోస్ వస్తే అది కవర్ అయిపోతుంది.