నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దు – బాలకృష్ణ

తనను స్ఫూర్తిగా తీసుకోవద్దని అంటున్నారు బాలకృష్ణ. అయితే ఈ సూచన అందరికీ కాదు. కేవలం తన కొడుక్కి మాత్రమే. అవును.. తనను స్ఫూర్తిగా తీసుకోవద్దని మోక్షజ్ఞకు సూచించారట బాలకృష్ణ. దీనికి ఓ కారణం ఉంది.…

తనను స్ఫూర్తిగా తీసుకోవద్దని అంటున్నారు బాలకృష్ణ. అయితే ఈ సూచన అందరికీ కాదు. కేవలం తన కొడుక్కి మాత్రమే. అవును.. తనను స్ఫూర్తిగా తీసుకోవద్దని మోక్షజ్ఞకు సూచించారట బాలకృష్ణ. దీనికి ఓ కారణం ఉంది.

“మా వాడు ఉన్నాడు ఒకడు, మోక్షు. వాడు రావాలి ఇండస్ట్రీకి. విశ్వక్ సేన్ లాంటోళ్లను వాడు స్ఫూర్తిగా తీసుకోవాలి. నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దంటాను. నేను ఇలా చెబితే నా అభిమానులు బాధపడతారు, కానీ నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దనే వాడికి చెబుతాను. విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాంటి కుర్రాళ్లను ఇన్ఫిరేషన్ గా తీసుకోమని చెబుతాను.”

ఇన్ని విషయాలు చెప్పిన బాలయ్య, మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పట్లానే తన కొడుకు గురించి మరింత మాట్లాడాలనుకొని, తన ప్రసంగాన్ని ఇంకెటో తీసుకెళ్లిపోయారు.

“నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తాను. జనం ఏం కోరుకుంటారో ఆలోచించి, ముందే నేను అందించేస్తుంటాను. నేను ఓ నిత్యావసర వస్తువుని. రోజువారీ కార్యకలాపాల్లో దైనందిక చర్యల్లా నటులు కూడా ప్రజలకు ఓ నిత్యావసర వస్తువుగా మారారు.”

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడారు బాలకృష్ణ. తన కొడుక్కి తను ఎప్పుడూ అండగా ఉంటానని, కానీ తను కుర్ర హీరోల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.