విరాళాలు ఇవ్వ‌డానికి విజ‌య‌వాడ‌కు సినీ ప్ర‌ముఖులు

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ అంద‌జేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు జొన్న‌లగ‌డ్డ సిద్ధు, విశ్వ‌క్‌సేన్ విజ‌య‌వాడ‌కు వెళ్లారు. ఏపీకి నంద‌మూరి బాల‌కృష్ణ రూ. 50 లక్షలు,…

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ అంద‌జేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు జొన్న‌లగ‌డ్డ సిద్ధు, విశ్వ‌క్‌సేన్ విజ‌య‌వాడ‌కు వెళ్లారు. ఏపీకి నంద‌మూరి బాల‌కృష్ణ రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు, విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

ఈ మొత్తాల్ని అంద‌జేయ‌డానికి వారు విజ‌య‌వాడ వెళ్ల‌డం విశేషం. బాల‌య్య మీడియాతో మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా మ‌నంద‌రిది తెలుగు భాష అన్నారు. భారీ వ‌ర‌ద‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనేక గ్రామాలు నీట మునిగాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక ప్రాంతానికి స‌మ‌స్య వ‌స్తే, మ‌రో ప్రాంతం అండ‌గా నిలుస్తూ అంతా ఒక కుటుంబ స‌భ్యుల్లా ప‌ని చేశార‌ని మెచ్చుకున్నారు.

గ‌తంలో రాష్ట్రానికి విప‌త్తు వ‌స్తే ఎన్టీఆర్ ప్రాంతాల‌న్నీ తిరిగి జోలే ప‌ట్టేవార‌ని బాల‌య్య గుర్తు చేసుకున్నారు. షూటింగ్‌లో సినీ న‌టులు బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అంద‌రూ త‌మ వంతు బాధ్య‌త‌గా స్పందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

వ‌ర‌ద‌ని ప్ర‌భుత్వం సృష్టించింద‌ని కొంద‌రు నాయ‌కులు ఆరోప‌ణ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. విప‌త్తుల స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మంచిగా స్పందించింద‌ని ఆయ‌న ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.

16 Replies to “విరాళాలు ఇవ్వ‌డానికి విజ‌య‌వాడ‌కు సినీ ప్ర‌ముఖులు”

    1. Godavari delta is about 10 lakh acres. Babu promised a mere 10,000 per acre, this alone costs 1000 crores. These donations are not even 10% of this, leave alone Vijayawada loss.

  1. మరీ 5 లక్షలు ఏందీ వయ్య. మీరు నెలకు పోరి ల మీద దారు మీద ఖర్చు పెట్టేంత కూడా లేదు

  2. balayya nee babu thagaleyya mee nanna unnappudu EKKUVAGA MUNDU SUPERSTAR KRISHNA GARU SPANDINCHI APPATLONE 1 LACK donation ichevaru .nee babu,anr,shobhan krishna raju donation kalipinaa krishnagarichina 1 lack daatedi kadu…

Comments are closed.