బాలయ్య చేతిలో మరో కొత్త ఆయుధం

బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే, అందులో బాలయ్య హెయిర్ స్టయిల్ పై ఎంత శ్రద్ధ ఉంటుందో.. అతడి చేతిలో కనిపించే ఆయుధంపై కూడా అంతే రీసెర్చ్ జరుగుతుంది. ఈసారి కూడా సరికొత్త హెయిర్…

బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే, అందులో బాలయ్య హెయిర్ స్టయిల్ పై ఎంత శ్రద్ధ ఉంటుందో.. అతడి చేతిలో కనిపించే ఆయుధంపై కూడా అంతే రీసెర్చ్ జరుగుతుంది. ఈసారి కూడా సరికొత్త హెయిర్ స్టయిల్ తో, చేతిలో మరో కొత్త ఆయుధంతో బరిలో దిగాడు బాలయ్య.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీకి భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టారు. ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. తాజాగా టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో సరికొత్త ఆయుధంతో దర్శనమిచ్చాడు బాలకృష్ణ.

ఈ సినిమాకు సంబంధించి బాలయ్య లుక్ కొత్తదేం కాదు. ఎందుకంటే, ఆయన ఫస్ట్ లుక్ ఆల్రెడీ రిలీజైంది కాబట్టి. ఈరోజు రిలీజైన పోస్టర్ లో కొత్తదనం ఏదైనా ఉందంటే, అది అతడి చేతిలో ఉన్న ఆయుధం మాత్రమే. చూడ్డానికి చాలా వెరైటీగా ఉంది ఆ ఆయుధం.

టాలీవుడ్ లో కొత్తకొత్త ఆయుధాలు సృష్టించాలంటే రాజమౌళి, బోయపాటి తర్వాతే ఎవరైనా. బాలయ్య మూలంగా ఇప్పుడా లిస్ట్ లోకి అనీల్ రావిపూడి చేరినట్టు కనిపిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, కూతురి వరస పాత్రలో శ్రీలీల కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది భగవంత్ కేసరి.