మొన్నటివరకు లావణ్య త్రిపాఠి పెళ్లిపై గాసిప్స్ నడిచాయి. ఇప్పుడు మేఘా ఆకాష్ వంతు వచ్చింది. అవును.. ఈ బ్యూటీ కూడా ఇప్పుడు పెళ్లికి సిద్ధమైందంటూ కోలీవుడ్ నుంచి కథనాలు వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ పొలిటీషియన్ కొడుకుతో మేఘా ఆకాష్ పెళ్లి జరుగుతుందట.
సదరు పొలిటీషియన్ కుటుంబం, మేఘా ఆకాష్ కుటుంబం చాన్నాళ్లుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్నారట. ఇప్పుడా స్నేహాన్ని చుట్టరికంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యారట. సో.. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లిగా కనిపిస్తోంది. అయితే ఆ పొలిటీషియన్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న కథనాల ప్రకారం.. కన్యాకుమారికి చెందిన ఓ ప్రముఖ రాజకీయవేత్త, వ్యాపారవేత్త కొడుకును మేఘా ఆకాష్ పెళ్లి చేసుకుంటుందట.
హీరోయిన్లు, పొలిటీషియన్లు పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. ఇంతకుముందు ఎంతోమంది హీరోయిన్లు ఆ పని చేశారు. తాజాగా పరిణీతి చోప్రా కూడా రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఇప్పుడీ లిస్ట్ లోకి మేఘా ఆకాష్ చేరేలా కనిపిస్తోంది.
కెరీర్ లో ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయింది మేఘా ఆకాష్. రజనీకాంత్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఆమె కెరీర్ లో హిట్ సినిమా ఏదైనా ఉందంటే, అది రాజరాజచోర మాత్రమే.
ఈ గ్యాప్ లో ఆమె నిర్మాతగా కూడా మారింది. తల్లితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఈ ఏడాది మేఘా ఆకాష్ చాలా బిజీగా ఉంది. తెలుగు-తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన తాజా తెలుగు చిత్రం రావణాసుర.