బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో వుంది. ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలు అంటే ఫ్లాపులు ఎక్కువ వుండేవి. ఇది అయిదారేళ్ల కిందటి సంగతి. ఇప్పుడు బాలయ్య మారిపోయారు. అప్పట్లో బాలయ్య నిర్మాత ఎవరు అయినా ఓకె. దర్శకుడు ఎవరు అయినా ఓకె. కథ ఏదైనా ఓకె. చేసేయడమే. కానీ ఇప్పుడు మారిపోయారు. అన్నీ చూసుకుని కానీ నిర్మాతకు ఓకె చెప్పడం లేదు.
సరైన దర్శకుడు అయితే తప్ప ఎస్ అనడం లేదు. స్క్రిప్ట్ విని, నిర్మొహమాటంగా ఎస్.. నో చెబుతున్నారు. అలా అని అక్కడితో వదిలేయడం లేదు. సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చెబుతున్నారు. క్వాలిటీ చెక్ లు చేస్తున్నారు.
అఖండ తరువాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ, తరువాత మళ్లీ బోయపాటి. అలాగే కొడుకు సినిమా కోసం ప్రశాంత్ వర్మ. ఇలా ఎంచుకుంటున్నారు. అంతే కాదు. కథలను ఒకంతట ఓకె అనడం లేదు. మార్పులు చేర్పులు చెబుతున్నారు. భగవంత్ కేసరి సినిమా స్క్రిప్ట్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం బాలయ్య మార్చిందే. ముందుగా అనిల్ రావిపూడి అనుకున్నది వేరు.
ఇప్పుడు లేటెస్ట్ సినిమా బాబీతో జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ విషయంలో కూడా బాలయ్య చాలా పట్టుగా వున్నట్లు తెలుస్తోంది. మార్పులు చేర్పులు చేయించినట్లు బోగట్టా. అంతే కాదు, షూట్ చేసిన కొన్ని సీన్లు తీయించేసినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. వాటికి బదులుగా కొత్త సీన్లు తీస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూట్ రాజస్ధాన్ లో షెడ్యూలు చేసి వుంది. కాస్త లాంగ్ షెడ్యూలు నే ఇది.
ఇప్పటి వరకు ముహుర్తాల విషయంలోనే పట్టుదలగా వుండేవారు. తనను ఎవరు కలవాలన్నా, ఏ విషయం డిస్కస్ చేయాలన్నా అన్నింటికి టైమ్ ఫిక్స్ అన్నది బాలయ్యే చేసేవారు. ఇప్పుడు దాంతో పాటే స్క్రిప్ట్ లు కూడా గట్టిగా చూసుకుంటున్నారు. మారిపోయారు మొత్తానికి బాలయ్య.
Is Sai Korrapati safe?
That credit goes to balayya daughter tejaswini.she involved in diector selection and costumes
యెల్లో మీడియా కి అమ్ముడు పోయావా జి.ఆ
adi jaragadu le paytm kumar …. GA ki jaggadi matta kudavande nidra pattadu ..
జనం పట్టించుకోరు
జనం కూడా మారిపోయారు, థియేటర్లో చూడటం లేదు
మీరు మారినా మేం థియేటర్లో చూడం
మేం కూడా ఏది పడితే అది థియేటర్లో చూడం