Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య నోటి దురుసు: ఎన్టీఆర్ కు భారతరత్న రాదు

బాలయ్య నోటి దురుసు: ఎన్టీఆర్ కు భారతరత్న రాదు

బాలయ్య నోటి దురుసు గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా అంశాన్ని రచ్చ చేసి మాట్లాడాలంటే బాలయ్యను రంగంలోకి దించాల్సిందే. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పై కూడా బాలయ్య గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతరత్నను కాలిగోటితో సమానం అన్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు బాలయ్య.

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుల ప్రస్తావన తీసుకొచ్చింది యాంకర్. ఒక ప్రశ్న అడిగితే, దానికి సమాధానంగా ఇంకెటో వెళ్లిపోవడం బాలయ్యకు అలవాటే కదా. ఏ ప్రశ్న అడిగినా ''మా తండ్రిగారు'' అంటూ అక్కడికో వెళ్లిపోతారు. సంగీత దర్శకుల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అలానే స్పందించారు. ఆస్కార్ అవార్డు విజేత రెహ్మాన్ ను కించపరచడమే కాకుండా.. దానికి కొనసాగింపుగా భారతరత్న అవార్డును చెప్పుతో సమానం అన్నారు.

"రెహ్మాన్ ఎవడో నాకు తెలీదు, నేను పట్టించుకోను అసలు. పదేళ్లకు ఓ హిట్ ఇస్తాడు, ఆస్కార్ అవార్డు అంటాడు. అవన్నీ నాకు తెలీదు. ఇక ఎన్టీఆర్ కు భారతరత్న అంటారు చాలామంది. భారతరత్న అవార్డ్ ఆయన చెప్పుతో సమానం, కాలి గోటితో సమానం. ఎన్టీఆర్ కు అవార్డ్ ఇస్తే ఇచ్చేవాళ్లకు గౌరవం వస్తుంది. ఆయనకు గౌరవం ఇవ్వడం ఏంటి? ఆయన అంతకంటే ఎక్కువ."

ఇలా భారతరత్న అవార్డుపై మరోసారి నోరు పారేసుకున్నారు బాలయ్య. దేశమంతా ఎంతో గొప్పగా చూసే ఈ అవార్డును తుచ్ఛమైనదిగా తీసిపారేశారు. తాజా వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. బాలయ్య తన నోటి దురుసుతో, ఎన్టీఆర్ కు భవిష్యత్తులో కూడా భారతరత్న అవార్డ్ రాకుండా చేశారని బాధపడుతున్నారు. 

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను