Advertisement

Advertisement


Home > Movies - Movie News

అతడు నిజంగానే 'పోర్న్' కుంద్రా..హీరోయిన్లు ఆరోపణ

అతడు నిజంగానే 'పోర్న్' కుంద్రా..హీరోయిన్లు ఆరోపణ

భారత్ లో నిషేధం విధించిన పోర్న్ మూవీస్ ను చిత్రీకరించి, సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలు నిర్మించి, కొన్ని యాప్స్ లో పెట్టి, వాటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడనేది అతడిపై ప్రధాన ఆరోపణ. రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాక కొంతమంది తారలు బయటకొచ్చారు. నిజంగానే అతడు ''పోర్న్'' కుంద్రా అంటూ ఆరోపణలు చేస్తున్నారు. మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

రాజ్ కుంద్రా కేసుపై హాట్ బ్యూటీ పూనమ్ పాండే సూటిగా స్పందించింది. ఓ యాప్ కోసం కుంద్రాకు చెందిన కంపెనీతో తను 2019లో ఒప్పందం చేసుకున్నానని, వచ్చిన ఆదాయంలో పర్సంటేజీ మాట్లాడుకున్నామని తెలిపింది. అయితే రెవెన్యూ షేరింగ్ లో అవకతవకలు గుర్తించి, తను ఆ ఎగ్రిమెంట్ నుంచి తప్పుకున్నానని తెలిపింది. అదే విషయాన్ని ఈమెయిల్ ద్వారా కూడా వాళ్లకు తెలిపానని, అయినప్పటికీ తనకు చెందిన వీడియోలు, ఫొటోల్ని అక్రమంగా ఇప్పటికీ వాళ్ల యాప్ లో పెడుతున్నారని పూనమ్ పాండే ఆరోపించింది.

మరో మోడల్ సాగరిక అయితే ఏకంగా కుంద్రాపై భారీ ఎత్తున కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. వాట్సాప్ వీడియో కాల్ లో తనతో న్యూడ్ వీడియో ఛాట్ చేయాలంటూ కుంద్రా బలవంతం చేశాడని సాగరిక ఆరోపించింది. ఈ కేసులో శిల్పాషెట్టి ప్రమేయంపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది.

యూట్యూబర్ పునీత్ కౌర్, షెర్లీన్ చోప్రా, హీరోయిన్ గెహనా కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. హాట్ షాట్స్ కు సంబంధించిన పోర్న్ కంటెంట్ తనకు సోషల్ మీడియాలో డైరక్ట్ మెసేజ్ రూపంలో రాజ్ కుంద్రా నుంచి వచ్చేదని, స్పామ్ వల్ల అలా జరిగి ఉండొచ్చని తను అప్పట్లో సర్దుకున్నానని, కానీ కుంద్రానే అవి పంపించాడనే విషయం తనకు ఇప్పుడు అర్థమైందని చెప్పుకొచ్చింది పునీత్ కౌర్.

కుంద్రా కంపెనీ కోసం దాదాపు 15-20 ప్రాజెక్టులకు పనిచేసిన షెర్లీన్ చోప్రా.. తనకు మాత్రం కుంద్రా నుంచి భారీగానే డబ్బులొచ్చాయని చెప్పుకొచ్చింది. మరోవైపు హీరోయిన్ గెహనా మాత్రం కుంద్రాను వెనకేసుకొచ్చింది. కుంద్రా యాప్స్ లో వీడియోల్ని పోర్న్ గా చూడొద్దంటోంది ఈమె. వాటిని ఎరోటిక్ వీడియోలు అనాలంట. కాబట్టి కుంద్రా చేసింది తప్పు కాదంటోంది గెహనా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?