మరింత రంజుగా మారిన సంక్రాంతి

వచ్చే ఏడాది సంక్రాంతికి మెల్లమెల్లగా పోటీ ముదురుతోంది. ఇప్పటికే రేసులో చిరంజీవి నిలవగా, తాజాగా వెంకటేష్ కూడా వచ్చి చేరారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బాలకృష్ణ కూడా ఎంటరయ్యారు. దీంతో సీనియర్ హీరోల సంక్రాంతి…

వచ్చే ఏడాది సంక్రాంతికి మెల్లమెల్లగా పోటీ ముదురుతోంది. ఇప్పటికే రేసులో చిరంజీవి నిలవగా, తాజాగా వెంకటేష్ కూడా వచ్చి చేరారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బాలకృష్ణ కూడా ఎంటరయ్యారు. దీంతో సీనియర్ హీరోల సంక్రాంతి వార్ కు రంగం సిద్ధమైంది.

తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, సంక్రాంతి వార్ ను సూచిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని స్వయంగా బాలయ్య ప్రకటించారు.

లెక్కప్రకారం ఈపాటికే సినిమా రెడీ అవ్వాలి. కానీ ఏపీలో ఎన్నికల ప్రచారం కారణంగా షూటింగ్స్ కు 3 నెలలు గ్యాప్ ఇచ్చారు. ఈమధ్యే జైపూర్ లో లాంగ్ షెడ్యూల్ పూర్తిచేసిన బాలయ్య.. ఈ చిత్రాన్ని కుదిరితే డిసెంబర్ చివర్లో లేదా సంక్రాంతికి తీసుకొస్తామని ప్రకటించారు.

బాలకృష్ణ చెప్పినట్టు ఈ రెండు నెలల్లో ఎప్పుడు సినిమాను రెడీ చేసినా పోటీ తప్పదు. డిసెంబర్ చివర్లో విడుదల చేస్తే, గేమ్ ఛేంజర్ తో బాలయ్య సినిమా పోటీపడుతుంది. ఇక సంక్రాంతికి రెడీ చేస్తే, ఏకంగా చిరంజీవి వెర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ షురూ.

చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాను జనవరి 10న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇక వెంకటేష్-అనీల్ రావిపూడి సినిమాను కూడా సంక్రాంతికే షెడ్యూల్ చేశారు. ఈ మూవీకి ఏకంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ అనుకుంటున్నారు.

నిజానికి రేసులో రవితేజ కూడా ఉన్నాడు. తన 75వ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించాడు రవితేజ. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో ధమాకా మేజిక్ ను రిపీట్ చేయాలనుకున్నాడు. కానీ చేతికి సర్జరీ అవ్వడంతో రవితేజ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా సంక్రాంతికి వచ్చేది అనుమానమే. ప్రస్తుతానికైతే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఫిక్స్.

3 Replies to “మరింత రంజుగా మారిన సంక్రాంతి”

Comments are closed.