వామ్మో… ఏపీకి మ‌రో తుపాను!

అస‌లే తుపాను ప్ర‌భావంతో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఏపీలోని కొన్ని జిల్లాలు మిన‌హాయిస్తే, మెజార్టీ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుపాను అత‌లాకుత‌లం చేసింది. విజ‌య‌వాడ న‌గ‌రం విల‌య‌వాడ సిటీగా మారింది.…

అస‌లే తుపాను ప్ర‌భావంతో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఏపీలోని కొన్ని జిల్లాలు మిన‌హాయిస్తే, మెజార్టీ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుపాను అత‌లాకుత‌లం చేసింది. విజ‌య‌వాడ న‌గ‌రం విల‌య‌వాడ సిటీగా మారింది.

గోరుచుట్టుపై రోక‌టి పోటు సామెత చందంగా… మ‌ళ్లీ ఏపీకి తుపాను ముప్పు పొంచి వుంద‌నే హెచ్చ‌రిక క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విష‌యాన్ని విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఇది తుపానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నాఉ. అయితే ఏ ద‌శ‌లో ప‌య‌నించేది ఒక‌ట్రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అధికారులు చెబుతున్నారు.

మ‌రో మూడు, నాలుగు రోజుల్లో ఇంకో తుపాను పంజా విస‌ర‌నుంద‌నే వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జానీకం జాగ్ర‌త్త‌గా వుండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌కుండా అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నారు.

15 Replies to “వామ్మో… ఏపీకి మ‌రో తుపాను!”

  1. ఇపుడు బాబు వచ్చాడు తుఫానులు వచ్చాయి అని ప్రచారం చేస్తారా?

    జగన్ ఏం చేస్తున్నాడు? ఇంట్లో ప్రత్యేక ప్రార్థనలు పెట్టాడా?

      1. జగన్ మీద ప్రజల అంత ఆగ్రహం ఉంటుందని, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన కారణాలలో ఒకటి కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై. ప్రజలు ఈ కుల విద్వేషాలపై విసుగు చెంది, జగన్ కోసం ఓట్లు వేసే బదులు, ఈ కుల విద్వేషాలను ప్రోత్సహిస్తున్న జగన్ పార్టీపై మరింత ద్వేషం పెంచుకున్నారు.

        ఇంకో పెద్ద సమస్య అమరావతి రాజధాని అంశం. ప్రజలు తమకు కావలసిన పాఠాలు నేర్చుకున్నారు, కానీ కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అనుచరులు తమ సొంత పార్టీకి హాని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ ద్వేష వ్యాపారం వల్ల. పార్టీ నిలబడాలంటే కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం తక్షణమే ఆపాలి. వైసీపీ అనుచరులు పెద్దవాళ్లలా ఆలోచించాలి, మంచి మనుషులుగా మారండి, విభజనల్ని ప్రోత్సహించడం మానుకోండి.

  2. జగన్ మీద ప్రజల అంత ఆగ్రహం ఉంటుందని, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన కారణాలలో ఒకటి కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై. ప్రజలు ఈ కుల విద్వేషాలపై విసుగు చెంది, జగన్ కోసం ఓట్లు వేసే బదులు, ఈ కుల విద్వేషాలను ప్రోత్సహిస్తున్న జగన్ పార్టీపై మరింత ద్వేషం పెంచుకున్నారు.

    ఇంకో పెద్ద సమస్య అమరావతి రాజధాని అంశం. ప్రజలు తమకు కావలసిన పాఠాలు నేర్చుకున్నారు, కానీ కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అనుచరులు తమ సొంత పార్టీకి హాని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ ద్వేష వ్యాపారం వల్ల. పార్టీ నిలబడాలంటే కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం తక్షణమే ఆపాలి. వైసీపీ అనుచరులు పెద్దవాళ్లలా ఆలోచించాలి, మంచి మనుషులుగా మారండి, విభజనల్ని ప్రోత్సహించడం మానుకోండి.

Comments are closed.