టాలీవుడ్ లో ఇప్పుడు మాట్లాడకూడని అంశం ఏదైనా ఉందంటే అది సినిమా వసూళ్ల గురించే. తమ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని ఎవరైనా చెప్పుకుంటే, అక్కడ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రత్యక్షం అవుతున్నారు.
పుష్ప-2 తీసిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్ని తెరకెక్కించిన దిల్ రాజుపై ఇన్ కం ట్యాక్స్ రైడ్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైమ్ లో వసూళ్ల గురించి మాట్లాడ్డం సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసం చేశారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.
అది కూడా తన సినిమా విడుదలకు ముందే ప్రకటన చేసి మరింత సాహసం చేశారు. తను ఈ మాట చెప్పడానికి ధైర్యం చేస్తున్నానని అంటూనే.. నాగచైతన్య కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా తండేల్ నిలుస్తుందని అన్నారు అరవింద్.
ఓవైపు ఐటీ రైడ్స్ జరుగుతుంటే, మరోవైపు తన తండేల్ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని అల్లు అరవింద్ చెప్పడం, ఐటీ అధికారులకు హింట్ ఇవ్వడమే అంటూ చెవులు కొరుక్కుంటున్నారు టాలీవుడ్ జనం.
అరవింద్ ఇక్కడితో ఆగలేదు. తండేల్ పై నాగచైతన్య రెండేళ్లుగా వర్క్ చేస్తున్నాడనే విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఏడాదిగా వర్క్ చేస్తున్నందుకే ఆయనకు పారితోషికం కింద చాలా ఇచ్చామని, రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారంటూ రాస్తే ఆయన మరింత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాడని అన్నారు.
ఈ సినిమాకు నాగచైతన్య తన కెరీర్ లోనే అత్యధిక మొత్తం పారితోషికం తీసుకున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. మొత్తానికి తన మాటలతో అల్లు అరవింద్, ఐటీ అధికారుల్ని ఆకర్షించారు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
potti aravind ki poyekaalam vachhindaho
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
Bahubali records break