నారా లోకేష్ జన్మదినం ఇవాళ. చంద్రబాబునాయుడు తర్వాత ఆయనే మా నాయకుడు అని పార్టీ మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆల్రెడీ చాలా స్పష్టంగా ప్రకటించారు. యెల్లో సింగం అంటూ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక పాటను విడుదల చేశారు. ఈ రకముగా.. తెలుగుదేశం పార్టీలో.. తలపండిన వృద్ధ నేతల దగ్గరినుంచి, బొడ్డూడని పసికూన నేతల వరకు అందరూ కూడా ఈ రోజును లోకేష్ ను కీర్తించడానికి, స్తుతించడానికి, భజన చేయడానికి తమ జీవితాలను అంకితం చేశారు.
మంచిదే. రేప్పొద్దున్న ముఖ్యమంత్రి అయిపోతాడని వారందరూ భావిస్తున్న నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరికి వారు ఆ మాత్రం తాపత్రయ పడుతూనే ఉంటారు. ఆ పోకడను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ.. లోకేష్ జన్మదినం కనుక- ప్రజలకు వరాలు ప్రకటిస్తున్నాం అని చెప్పి ఖజానాకు తూట్లు పొడవడం ఏమిటో అర్థం కాని సంగతి.
ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి.. లోకేష్ బర్త్ డే సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఏదో ఒక యాక్టివిటీ ద్వారా మీడియా ఎదుటకు వచ్చి.. లోకేష్ భజన చేయాలనే సంకల్పంతోనే రకరకాల మార్గాలను అనుసరించారు. ఆ క్రమంలో జీవీరెడ్డి ప్రెస్ మీట్ కూడా ఒకటి. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు వరాలను ప్రకటించారు. నిజానికి అవి లాజిక్ లేని వరాలు.
జగన్ ప్రభుత్వంలో కొందరు కేబుల్ ఆపరేటర్ల మీద వంద కోట్ల రూపాయల పెనాల్టీలు వేశారట. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఆ వంద కోట్ల పెనాల్టీలను మాఫీ చేస్తున్నట్టు జీవీరెడ్డి ప్రకటించారు. వంద కోట్ల పెనాల్టీల మాఫీ అంటే చిన్న సంగతి కాదు. ప్రభుత్వానికి చేతనైతే.. గత ప్రభుత్వం పెనాల్టీలు వేయడంలో అక్రమాలు జరిగాయని చెప్పాలి.. నిరూపించాలి! లేదా తెలుగుదేశానికి చెందిన వారి మీద మాత్రమే పెనాల్టీలు వేశారని రాజకీయ విమర్శ చేయాలి.. ఆ రకంగా వేధించారని చెప్పుకోవాలి.! ఇక్కడ అదేం లేదు.
తప్పు చేయకుండా పెనాల్టీలు ఎందుకు వేసి ఉంటారు? ఏ ఎగవేతలూ చేయకుండానే.. అవి జరిగి ఉంటాయా? ఏ తప్పూ చేయకుండా పెనాల్టీలు వేసి ఉంటే.. అప్పట్లోనే సదరు కేబుల్ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించి ఉంటారు కదా.. అనే సందేహాలు సామాన్యులకు కలుగుతాయి గానీ.. జీవీరెడ్డి మాటల్లో అదేం లేదు.
ఇలాంటి ప్రకటన వల్ల- కేబుల్ ఆపరేటర్లు వందకోట్లు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సి ఉండగా.. దానిని ఏకంగా మాఫీ చేయడం అంటే.. కనీసం యాభైకోట్లకు అయినా డీల్ కుదిరి ఉంటుందనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. సదరు జీవీరెడ్డి.. ‘‘లోకేష్ బర్త్ డే సందర్భంగా’’ అని ప్రకటిస్తున్నారు గనుక.. అచ్చంగా ఆ యాభైకోట్లు తమ నాయకుడికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడానికే డీల్ చేసుకుని, ఈ పెనాల్టీ మాఫీ చేసి ఉంటారా? అనేది ప్రజల అనుమానం.
ప్రభుత్వాలు రుణమాఫీలు చేయడం అనేది పేదలను ఆదుకునే చర్యగా మనకు కనిపిస్తుంది. అదే సమయంలో పెనాల్టీలను మాఫీ చేయడం అనేది.. అడ్డదారి దోపిడీకి ఎంచుకున్న మార్గంగా అనిపిస్తుంది.
జీవీరెడ్డి అదొక్కటే కాదు.. మరో వరం కూడా లోకేష్ పుట్టినరోజు సందర్భంగానే ప్రకటించారు. ఫైబర్ నెట్ కేబుల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు బాక్స్ లకు రెంటల్ గా నెలకు రూ.59 వంతున చెల్లిస్తుండగా.. వాటిని కూడా రద్దు చేశారు. తమ నాయకుడి పుట్టినరోజు పేరు పెట్టి.. ఇలా ప్రభుత్వఖజానాకు చిల్లు పెట్టడం ఏ రకంగా ధర్మం అని ఆలోచన పరులు ప్రశ్నిస్తున్నారు.
నాయకుడి బర్త్ డే అయితే.. జీవీరెడ్డి తన రక్తాన్ని దానమిచ్చి ఉంటే అందంగా ఉండేదని, సర్కారు ఖజానాను దోచి, చిల్లుపెట్టి నాయకుడికి కానుకలాగా మాట్లాడడం చిత్రం అని ప్రజలు అంటున్నారు.
10 వేల రూపాయల చొప్పున కనీసం కొంతమంది పేదల కు రుణ మాఫీ అయినా చేసుండాల్సింది…
prabhutvam lo unna vallu a penalty yenduku vasulu cheyyaledu?
జగ్గులు birthdays కి చేసిన అతితో పోలిస్తే ఇది అసలు ఏముంది?
ఆ రోజులలో పండగలకి పుట్టినరోజులకి జనాల డబ్బుతో సెట్టింగులు వేయిస్తాం. ఇప్పుడు స్టేట్ దాటి పారిపోతాం..
pravaledhule…nuvvemi feel avvaku GA…
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ముష్టి పథకాలు మాత్రం మన చెబులోంచి ఇచ్చామా ? అప్పుడు ప్రభుత్వాన్ని చిల్లు ఏమి కర్మ గండి పడింది ..
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ఏడ్చాకురా వెంకిటి , ఈ పనికిమాలిన సొల్లు వాగుడికే సర్వనాశనం అయ్యారు ఐనా ఇంకా బుద్ధి రాలేదు