వాళ్ల సొంత గొడవను కూడా వైసీపీకి పులుముతారా?

లోకేష్ కు డిప్యూటీ పోస్టు గురించి వివిధ వర్గాల నుంచి నేతలతో ప్రకటనలు చేయించడం.. ఇలాంటి వ్యూహమే అనేది అందరూ గ్రహిస్తున్నదే.

తెలుగుదేశం నాయకుల ప్రస్తుత తీరు ఎలా కనిపిస్తున్నదంటే.. ఏదైనా ఒక తెదేపా నాయకుడి ఇంట్లో భార్యాభర్తలు తగాదాపడి విడిపోవడం జరిగిందే అనుకోండి! ఆ తగాదాను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సృష్టించారని, తద్వారా తెలుగుదేశం నాయకుల కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారని, వారు మనశ్శాంతిగా బతకకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించేలాగా కనిపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం.. నారా లోకేష్ ను తక్షణం డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసేయాలని.. గళమెత్తి కోరుతున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాలు చివరిదశకు చేరుతున్న సమయంలో.. పదవులు ఆశించేవాళ్లంతా.. కీలకమైన లోకేష్ ప్రాపకం కోసం ఇలాంటి అడ్డగోలు మాటలతో దగ్గర కావాలని ప్రయత్నిస్తూ ఉండడం సహజం. కానీ.. లోకేష్ గురించి వారు వ్యక్తం చేసే అలాంటి ఆలోచనలు, ఆశల వల్ల.. కూటమిలో ఇతర పార్టీల్లో అసంతృప్తి ఏర్పడుతుందనేది కూడా అంతే సహజం.

ఇలాంటి నేపథ్యంలో తమ సొంత పార్టీ నాయకుల అత్యుత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్న.. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కుట్రలు చేస్తున్నారంటూ పోచికోలు కబుర్లు చెబుతున్నారు.

డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేయడానికి సంబంధించి టీడీపీలో ఒక నియమావళి ఉందని పల్లా అంటున్నారు. కొంతమంది నియమావళి దాటి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలమధ్య తగాదాలు సృష్టించి, కూటమిని చీల్చడానికి కాలకేయులలాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పల్లా అంటున్నారు. కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అంటున్నారు.

నిజానికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం కిందికి వచ్చిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ సనాతనంగా ఒక వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తోంది. వారు ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు.. ఆ పనికి ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు ఉంటాయని, వ్యతిరేకత ఉంటుందనే భయాలు ఉన్నప్పుడు వారు ఈ వ్యూహాన్ని అనుసరిస్తారు.

అలాగే.. తాము తీసుకోదలచని ప్రజావ్యతిరేక, స్వార్థ పూరిత నిర్ణయాలు ఏమైనా ఉంటే.. వాటిని ప్రనటించడానికంటె ముందే ప్రజల్లోకి లీక్ చేసి.. వాటి గురించి చర్చ జరిగేలా చేసి.. ఆ చర్చలను ప్రజల ఆలోచనలను మానిప్యులేట్ చేసి.. ఆ నిర్ణయాలు గొప్పవే అనే భావనను ప్రజల్లోకి చొప్పించి.. ఆ తర్వాత నిదానంగా నిర్ణయం ప్రకటిస్తారు. ఇది చాలా కాలంగా ఒక వ్యూహాత్మక తీరు.

ఇప్పుడు పల్లా మాటలు చూస్తే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. లోకేష్ కు డిప్యూటీ పోస్టు గురించి వివిధ వర్గాల నుంచి నేతలతో ప్రకటనలు చేయించడం.. ఇలాంటి వ్యూహమే అనేది అందరూ గ్రహిస్తున్నదే. అలాగే కూటమిని చీల్చడానికి వైసీపీ కుట్ర చేస్తున్నదని ప్రకటించడం గమనిస్తే.. కొత్త అనుమానం పుడుతోంది. కూటమిలోంచి ఆ రెండు పార్టీలను వెళ్లగొట్టి.. తమ సొంత బలంతో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ.. అదంతా వైసీపీ కుట్ర అని చెప్పడానికి వారు ఆలోచిస్తున్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

14 Replies to “వాళ్ల సొంత గొడవను కూడా వైసీపీకి పులుముతారా?”

  1. మీ ఇంట్లో మర్డర్ ని టీడీపీ కి పులిమేయలేదా..

    అప్పుడు మూసుక్కూర్చున్నావు.. ఇప్పుడు కూడా మూసుకో..

    ..

    మీ ఇంట్లో ఆస్తి తగాదాలను టీడీపీ కి పులిమేయలేదా..

    అప్పుడు మూసుక్కూర్చున్నావు.. ఇప్పుడు కూడా మూసుకో..

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. మోసపోయిన చెల్లెళ్లు, ఎదురుతిరిగి సవాల్ చెయ్యడంకూడా చంద్రబాబు కుట్ర లో భాగం అన్నప్పుడు గుర్తు లేదా గ్యాసు వెంకీ??

  4. గ్రేట్ ఆంధ్రా అని పేరు తీసేసి వైస్సార్సీపీ అధికార పత్రిక అని పెట్టుకో బాగుంటుంది

  5. పవన్ సిఎం అవ్వాలి అనుకుంటే ఆపే ధైర్యం టీడీపీకి ఉంది అనుకుంటున్నారా?

  6. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  7. ఎవరో తులసి అంట , అక్రమ ఆదాయం మొత్తం చుట్టుపక్కల నాలుగైదు నియోజక వర్గాల్లో కూటమి పెద్దలందరికి సమవర్తిల పంచుతాడుట. వాళ్ల పాత్రికేయులే రాశారు. కొసమెరుపుగా “తల”(తమిళ్) పగకి చుట్టేశారు as usual.

Comments are closed.