కల్కి.. ఎపిక్ డిజాస్టర్

సిల్వర్ స్క్రీన్ కు, స్మాల్ స్క్రీన్ కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఈమధ్య. వెండితెరపై సూపర్ హిట్టయిన సలార్ సినిమా టీవీల్లో అట్టర్ ఫ్లాప్ అయింది.

సిల్వర్ స్క్రీన్ కు, స్మాల్ స్క్రీన్ కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఈమధ్య. వెండితెరపై సూపర్ హిట్టయిన సలార్ సినిమా టీవీల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు అంతకుమించి డిజాస్టర్ అనిపించుకుంది కల్కి.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సంక్రాంతి సీజన్ లో జీ తెలుగు ఛానెల్ లో వేసిన కల్కి సినిమాకు కేవలం 5.26 టీఆర్పీ వచ్చింది. సాధారణంగా సంక్రాంతి టైమ్ లో వేసిన పెద్ద సినిమాలకు మంచి రేటింగ్స్ వస్తాయి. కానీ కల్కి మాత్రం ఈ విషయంలో ఫెయిలైంది.

‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప-1’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి సినిమాలకు వచ్చిన రేటింగ్స్ తో కల్కి సినిమా టీఆర్పీని కంపేర్ చేసి చూస్తే.. డిజాస్టర్ అనే పదం కూడా చిన్నదే అవుతుంది. బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు రికార్డ్ స్థాయిలో 29.4 రేటింగ్ వచ్చింది. ఇక మహేష్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఏకంగా 23.4 టీఆర్పీ వచ్చింది.

కల్కి టీఆర్పీతో వెండితెరకు, బుల్లితెరకు మధ్య వ్యత్యాసం క్లియర్ గా కనిపిస్తోంది. హనుమాన్, గుంటూరుకారం లాంటి సినిమాలకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ టీవీల్లో ఆ సినిమాను బాగా చూశారు.

ప్రభాస్ ఈమధ్య అన్నీ యాక్షన్ సినిమాలే చేస్తున్నాడని, మంచి ఫ్యామిలీ మూవీ పడితే.. టీఆర్పీలో అన్ని రికార్డుల్ని ప్రభాస్ బద్దలుకొడతాడని, అతడి ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు.

10 Replies to “కల్కి.. ఎపిక్ డిజాస్టర్”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. కల్కి లాంటి సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాలి.. టీవీ లో చూసే ఆసక్తి తక్కువ ఉంటుంది

  3. Kalki ki repeat value thakkuva, salaar ki family audience connect avvaru, only youth ki repeat value yekkuva salaar, ee both movies lo rotta comedy vundadhu, item songs, routine story vundadhu andhuke low trp

Comments are closed.