తండేల్ నుంచి దేవీ మార్క్ సాంగ్

ఎంతంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు… ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు

నాగ్ చైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో సినిమా తండేల్. ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. “బుజ్జితల్లీ” అంటూ గతంలో ఓ మాంటేజ్ సాంగ్ విడుదల చేశారు. అది బాగా వెళ్లింది జనాల్లోకి. ఇప్పుడు “… ఎంతంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు… ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు…” అనే డ్యూయట్‌ను విడుదల చేశారు. శిల్పకళా మందిర్‌లో ఫ్యాన్స్ నడుమ జరిగిన ఈవెంట్‌లో ఈ పాటను విడుదల చేశారు.

శ్రీమణి మంచి లిరిక్స్ అందించారు. దేవీశ్రీ ప్రసాద్ స్టైల్ ఇది అని వినగానే అనిపించే ట్యూన్‌ను అందించారు. కచ్చితంగా చార్ట్‌బస్టర్ అవుతుందీ పాట అనేట్లుగా ఉంది. అంతే కాదు, తండేల్ సినిమా ఆల్బమ్‌లో టాప్ సాంగ్‌గా నిలిచే అవకాశం ఉంది. పాట ఈవెంట్‌కు అల్లు అరవింద్‌, నాగ్ చైతన్య హాజరయ్యారు.

గతంలో దేవీ అందించిన కొన్ని పాటల ఛాయలు ఉన్నాయి ఈ హైలెస్ పాటలో. అందువల్లే కావచ్చు, తక్షణమే జనాలకు చేరుకునేలా ఉంది ఈ పాట. దేవీ పాటలు ముందుగా కాస్త నెమ్మదిగా ఉంటాయి. అలా అలా పెద్ద హిట్‌లు అవుతాయి. ఈ పాట ముందే హిట్ అయ్యేలా ఉంది వింటుంటే.

4 Replies to “తండేల్ నుంచి దేవీ మార్క్ సాంగ్”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.