Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఛీ..ఛీ నాగబాబుపై నేను మాట్లాడ్డమేంటి - బాలకృష్ణ

ఛీ..ఛీ నాగబాబుపై నేను మాట్లాడ్డమేంటి - బాలకృష్ణ

పరిశ్రమలో కొంతమంది భూములు పంచుకుంటున్నారంటూ నటుడు బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాలయ్యను ఎన్నో మాటలన్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బాలయ్య మాత్రం నాగబాబు మాటల్ని పట్టించుకోలేదు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

"నాగబాబు వ్యాఖ్యలపై నేను మాట్లాడ్డానికి ఏముంది. ఛీ..ఛీ.. ఆయన వ్యాఖ్యలపై నేను మాట్లాడేదేంటి. ఇండస్ట్రీ అంతా నాకు మద్దతుగా ఉన్నప్పుడు నేను కొత్తగా ఏం మాట్లాడాలి. అందరికీ అన్నీ తెలుసు."

ఇలా నాగబాబు కామెంట్స్ ను లైట్ తీసుకున్నారు బాలయ్య.  ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం వల్లనే తనను సమావేశానికి పిలవలేదనే వాదనను కొట్టిపారేశారు బాలయ్య. ఒకవేళ అదే నిజమైతే, ఆ మాట తనకు చెబితే సరిపోతుందని, అలా కూడా తనతో ఎవ్వరూ మాట్లాడలేదని మండిపడ్డారు.

"కేసీఆర్ పై నేను గతంలో చాలా విమర్శలు చేశాను. దాని వల్ల నన్ను దూరం పెట్టారని అనుకుందాం. మరి ఇండస్ట్రీలో ఉన్న జనాలు ఆ మాట నాకు చెప్పి చేయొచ్చు కదా. కేసీఆర్ కు నామీద కోపం ఉండదు. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఆ మాటకొస్తే మా నామా నాగేశ్వరరావును కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోలేదా. ఆయన ఎన్ని తిట్లు తిట్టాడు. ఇండస్ట్రీలో హిపోక్రసీ-సైకోఫ్యాన్సీ ఎక్కువ. నన్ను వేరుగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుతుంది. కేసీఆర్ కు నాపై అలాంటిదేం లేదు."

కేసీఆర్ కు తనపై పుత్రవాత్సల్యం  ఉందని, తనను మీటింగ్ కు పిలవొద్దని ఆయన చెప్పరని బాలయ్య నమ్మకంగా చెబుతున్నారు. కేవలం ఈ సమావేశం ఒక్కటే కాదని, గతంలో అమెరికా వెళ్లినప్పుడు కూడా తనను ఎవ్వరూ పిలవలేదని ఆక్రోషించారు.

"పరిశ్రమకు చెందిన అన్నింటిలో బాలకృష్ణ చొరవ తీసుకోరని కొంతమంది కామెంట్ చేశారు. అది నిజమే.. నేను ఇన్ వాల్వ్ కాను. అనవసరమైన వాటిలో దూరి నా టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కడతామన్నారు. చిరంజీవి అంతా కలిసి అమెరికా వెళ్లారు. నన్ను పిలవలేదు. కానీ నేనేం అనలేదు. నాకు అక్కర్లేని తలనొప్పులు నాకెందుకు."

తెలంగాణ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు బాలయ్య. ఓవైపు కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తుంటే.. సినిమా షూటింగ్స్ తొందరగా మొదలుపెట్టాలనే ఆరాటం ఎందుకని ప్రశ్నించారు. కేవలం ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం కోల్పోకుండా ఉండేందుకే, కరోనాను పక్కనపెట్టి మరీ తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు బాలయ్య.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?