Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య వస్తున్నాడా.. అయితే రవితేజదే విజయం

బాలయ్య వస్తున్నాడా.. అయితే రవితేజదే విజయం

దసరాకు బాలయ్య సినిమా వస్తోంది. అదే టైమ్ లో రవితేజ సినిమా కూడా వస్తోంది. బాలకృష్ణ సినిమా వస్తోంది కాబట్టి, రవితేజ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు అతడి అభిమానులు. ఈ ఇద్దరు హీరోల మధ్య ఇదో రకం సెంటిమెంట్ ఉంది మరి. 

ఇంతకీ ఏంటా సెంటిమెంట్..

బాలయ్య-రవితేజ బాక్సాఫీస్ బరిలో తలపడిన ప్రతిసారి రవితేజనే విజయం వరించింది. చరిత్ర చెబుతున్న వాస్తవం ఇది. ఉదాహరణకు 2008 సంవత్సరాన్నే తీసుకుంటే, ఆ ఏడాది బాలకృష్ణ, రవితేజ సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. రవితేజ నటించిన కృష్ణ, బాలకృష్ణ చేసిన ఒక్కమగాడు సినిమాల్లో ఏది సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.

ఇక ఆ మరుసటి ఏడాది, అంటే 2009లో కూడా ఇదే రిపీటైంది. ఈసారి వారం గ్యాప్ లో వచ్చారు ఈ ఇద్దరు హీరోలు. బాలకృష్ణ నటించిన మిత్రుడు మూవీ, రవితేజ చేసిన కిక్ సినిమాలు వచ్చాయి. వీటిలో మిత్రుడు డిజాస్టర్ అవ్వగా, కిక్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ముచ్చటగా మూడోసారి కూడా బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద కలిశారు. 2011లో పరమవీరచక్ర, మిరపకాయ్ సినిమాలు తలపడ్డాయి. ఈసారి కూడా రిజల్ట్ రవితేజకు అనుకూలంగా వచ్చింది.

మళ్లీ ఇన్నేళ్లకు బాలకృష్ణ, రవితేజ సినిమాలు మరోసారి తలపడబోతున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నారు. అదే టైమ్ లో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా దసరాకే షెడ్యూల్ చేశారు. సో.. సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా రవితేజనే హిట్ కొడతాడని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. అదే సమయంలో.. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోపై కూడా భారీ అంచనాలున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?