నందమూరి అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కరోనాపై మాట్లాడిన మాటలకు అలస్యంగానైనా బాలయ్య బాసటగా నిలిచారు.
విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న సెహారీ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం ఆయన హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనాకు వ్యాక్సిన్ రాలేదన్నారు. అసలు భవిష్యత్‌లో వ్యాక్సిన్ రాదని తేల్చి చెప్పారు.
కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని బాలయ్య తేల్చి చెప్పారు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే తప్ప మరో మార్గం లేదన్నారు. వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు.
అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవన్నారు. మన జీవితాంతం కరోనా ఉంటుందన్నారు. అందువల్ల దాంతో మనం కలిసి సహ జీవనం చేయాల్సిందేనని బాలయ్య స్పష్టం చేశారు. నేటి నుంచి కార్తీక సోమవారమని, అయినప్పటికీ తల స్నానాలు చేయవద్దని బాలయ్య సూచించారు.
ఇదిలా ఉండగా కరోనా వ్యాపిస్తున్న తొలి రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ అన్న ఈ మాటలను చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలంతా తీవ్రంగా తప్పు పట్టారు.
కరోనా వ్యాప్తిని జగన్ సీరియస్‌గా తీసుకోలేదని ప్రతిపక్ష నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. జగన్ అన్న ఆ మాటే ఇప్పుడు బాలయ్య నోట వచ్చింది. ఒక రకంగా ఇది బాబుకు బాలయ్య షాక్ ఇచ్చినట్టే. మరి బాలయ్య బావ, టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో మరి!