బాలయ్య కూడా స్టూడియో కడతారా?

విశాఖలో సినీ పరిశ్రమ రావడం కష్టమని సీనియర్ హీరో బాలక్రిష్ణ లాంటి వారు ఇపుడు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడికీ కదలదు అని కూడా అంటున్నారు. అయితే ఇదే బాలక్రిష్ణ తన బావ చంద్రబాబు…

విశాఖలో సినీ పరిశ్రమ రావడం కష్టమని సీనియర్ హీరో బాలక్రిష్ణ లాంటి వారు ఇపుడు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడికీ కదలదు అని కూడా అంటున్నారు. అయితే ఇదే బాలక్రిష్ణ తన బావ చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు  అంబికా క్రిష్ణ ఎఫ్ డీ సీ చైర్మన్ గా ఉన్నపుడు విశాఖలో స్టూడియో నిర్మాణానికి ముందుకు వచ్చారట.

ఆ విషయం అంబికా క్రిష్ణ ఈ మధ్య స్వయంగా మీడియాకు చెప్పారు. మరి ఇపుడు విశాఖలో సినీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు ఈ మధ్య చిరంజీవి నేత్రుత్వంలో సీఎంని కలసినపుడు కూడా విశాఖకు టాలీవుడ్ వస్తే బాగుంటుంది అన్న దాని మీదనే చర్చ జరిగింది. వారికి భూములు కూడా ఇస్తామని, స్టూడియోలు, ఇళ్ళు కూడా కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది.

మరి ఇపుడు బాలక్రిష్ణ సంగతేంటని ప్రశ్న వస్తోంది. విశాఖలో సినీ పరిశ్రమ అభివ్రుధ్ధి కోసం తన వంతు అంటూ అప్పట్లో బాలయ్య స్టూడియోకు ముందుకు వచ్చారు. ఇపుడు ఆయన కూడా నలుగురితో పాటు స్టూడియో కడతారా.

ఈ విషయంలో జగన్ని కలుస్తారా. తన వంతుగా సహకరిస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. విశాఖ సినీ రాజధాని విషయంలో రాజకీయాలు గట్టిగా పనిచేస్తున్నాయని అంతా భావిస్తున్నారు. నిజానికి విశాఖ‌ పాలనా రాజధాని అంటేనే టీడీపీ గయ్యిమంది.

ఇపుడు సినీ రాజధాని అన్నా అలాగే బ్రేకులు వేస్తుందేమో. కానీ విశాఖ అభివ్రుధ్ధికి పార్టీలకు అతీతంగా అంతా కలసి సహకరించాలని సినీ అభిమానులు, విశాఖ అభివ్రుధ్ధికాముకులూ కోరుకుంటున్నారు. మరి బాలయ్య ఏమంటారో.

‘జగనన్న చేదోడు’ ప్రారంభం