ఇది దీవెన. పెద్దవారి దీవెన. స్వయాన అన్న గారి దీవెన. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ వైసీపీలో ఉన్నారు. అన్న గారైన క్రిష్ణదాస్ ని మెచ్చి నచ్చి జగన్ మంత్రిని చేశారు. సుదీర్ఘకాలం మంత్రి పదవులు చేపట్టి సీనియర్ నేతగా ఉన్న ప్రసాదరావు కు మాత్రం అమాత్య కిరీటం దక్కడపోవడంతో బాధగానూ అసంత్రుప్తిగానూ ఉందని ప్రచారం.
ఇక ప్రసాదరావు తన ఆవేదనను ఎక్కడా దాచుకోవడంలేదు, ఆయన ప్రభుత్వం మీద బాణాలు ఇండైరెక్ట్ గా వేస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే అన్నగారితో పాటు, మరో మంత్రి ఆళ్ళ నాని అటెండ్ అయిన ఒక జిల్లా మీటింగులో ధర్మాన ఆగ్రహించారు.
ఈ పరిణామాల నేపధ్యంలో జిల్లా పెద్దగా, ఇంటికి కూడా పెద్దగా క్రిష్ణదాస్ మంచి మాటలే కొన్ని తమ్ముడికి చెప్పారనుకోవాలి. అన్నగారు స్వాంతనవచనాలతో ఉందిలే మంచికాలం అంటూ తమ్ముడికి బుజ్జగించారని కూడా భావించాలి.
అందుకే ప్రసాదరావుకు మంచి భవిష్యత్తు ఉంది. ఆయనను ఎన్నో ఉన్నత పదవులు వరిస్తాయని దీవించారు. క్రిష్ణదాస్ తన బాధ్యతగా ఇదంతా చేశారనుకోవాలి. ఏది ఏమైనా రెండున్నరేళ్ళ క్రిష్ణదాస్ మంత్రిత్వం తరువాత తమ్ముడికి మంత్రి యోగం ఉంటుందన్నది అన్న గారి ఆలోచనేమో. మొత్తానికి పెద్దాయన దీవెన తమ్ముడికి ఇప్పటికైతే ఆనందమే మరి.