Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య కేరాఫ్ డాటర్

బాలయ్య కేరాఫ్ డాటర్

నందమూరి బాలయ్య సినిమాలు, డేట్ లు, ప్రొగ్రాములు కావాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి అనే ప్రశ్న టాలీవుడ్ లో వినిపిస్తే డాక్టర్ సురేంద్ర అనే పేరు గట్టిగా వినిపించేది. 

డాక్టర్ గారు అనే రెగ్యులర్ పలుకుబడి కూడా వుండేది. కానీ ఇప్పుడు మరో పేరు కూడా వినిపిస్తోంది. బాలయ్య చిన్న కుమార్తె తేజ‌స్విని ఇప్పుడు తన తండ్రి వ్యవహారాలు మేనేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. తండ్రి గెటప్, కాస్ట్యూమ్స్, లైన్ లు అన్నింటి మీదా ఆమె కూడా జాగ్రత్తగా వుంటున్నారట. తరచు సెట్ లోకి కూడా వస్తున్నారట.

గతంలో బాలయ్య మిగిలిన విషయాలు అన్నీ ఎవరు చూసినా, ఆర్థిక వ్యవహారాలు అన్నీ ఆయర అర్థాంగినే చూసుకునేవారు. ఇప్పుడు ఆమె ఆ బాధ్యతలు చిన్న కూతురుకు అప్పగించారని తెలుస్తోంది.

గమ్మత్తేమిటంటే సెట్ లో తను ఎలా వుండాలనుకుంటారో అలాగే వుండే బాలయ్య, కూతురు సెట్ లోకి వస్తోంది అని వార్త వినిపిస్తే, చాలా బుద్దిగా కూర్చుంటున్నారట, ఎప్పుడైనా సిగరెట్ తాగే అలవాటు వున్న బాలయ్య కూతురు వుంటే దాన్ని కూడా పక్కన పెడుతున్నారట.

కూతుర్లు ఇద్దరినీ మాంచి క్రమశిక్షణతో పెంచారు అని తెలుసున్నవారంతా చెప్పుకుంటారు. పెద్ద అమ్మాయి హెరిటేజ్ వ్యవహారాల్లో తప్ప మరెక్కడా కనిపించరు. చిన్నమ్మాయి ఇప్పుడు బాలయ్య వ్యవహారాలు చూసుకుంటున్నారు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా