మనవాళ్లంతా పక్క రాష్ట్రాల నటుల వెంట పడుతుంటే వాళ్ల డిమాండ్ లు, పారితోషికాలు పెరిగిపోతున్నాయి. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబో సినిమాకు నయనతార ఎనిమిది కోట్లకు పైగానే కోట్ చేసిందని, దాంతో వెనకడుగు వేసారని వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు అదే సినిమాకు తీసుకుందామనుకున్న మరో నటుడి విషయంలో కూడా ఇదే జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ హీరో అరవింద్ స్వామిని తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించారు. సంప్రదింపులు కూడా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఇక్కడా వెనకుడుగే తప్పలేదని తెలుస్తోంది. ఎంత కోట్ చేసారు, ఎంత అయితే బెటర్ అని వీళ్లు అనుకున్నారు అన్నది క్లారిటీగా తెలియడం లేదు కానీ, రెమ్యూనిరేషన్ తమ బడ్జెట్ లో ఇమడక, వేరే ఆప్షన్ చూసుకుందామని యూనిట్ డిసైడ్ అయిపోయింది.
కొన్నేళ్ల క్రితం వరకు తమిళ, మలయాళ నటులు మన సినిమాలకు కోటి, రెండు కోట్లలో దొరికేవారు. కానీ ఇప్పుడు ప్రతి సినిమాకు మనవాళ్లు తమిళ, మలయాళ రంగాల వైపు చూస్తుంటే ఇవి అలా అలా పెరిగిపోయి అయిదు కోట్లకు దాటేసినట్లు తెలుస్తోంది. మరీ భారీ బడ్జెట్ సినిమాలకు, పాన్ ఇండియా సినిమాలకు భరించక తప్పదు.
బాలయ్య సినిమా పాన్ ఇండియా సినిమా కాదు. అందువల్ల వేరే ఆప్షన్ చూసుకోవచ్చని దర్శకుడు అనిల్ రావిపూడి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.