ఆస్తిత్వం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుటకోసం ఎప్పుడు బయటికి రాని రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. గెలుపు సంగతి ఏమో కానీ రాహుల్ పార్టీ కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ వర్గాలల్లో నూతన ఉత్సహం కనపడుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలాగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్ధితి కూడా కాంగ్రెస్ పార్టీ లాగే ఉంది.
రాజీవ్ గాంధీ అనంతరం కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న సోనియా గాంధీ ఇంత వరకు పార్టీ కోసం కష్టపడింది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక తన కొడుకు రాహుల్ గాంధీ పార్టీ పూర్తి బాధ్యతలు ఇచ్చి ప్రజలల్లో ఉండమని చెప్పింది. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఆరోగ్యం బాగున్నా కూడా వయసు మీద పడిపోతోంది. కానీ పార్టీ పగ్గాలను కొడుక్కు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. లోకేష్ కు పుల్ హ్యాండ్ ఇచ్చి ప్రజల్లో తిరగమని చెప్పాకుండా ఏడూ పదుల వయస్సులో కూడా తానే ప్రజల్లోకి వెలుతున్నారు.
రాహుల్ గాంధీకి జాతీయ స్ధాయిలో ఉన్న పేరు, నారా లోకేష్ కు రాష్ట్ర స్ధాయిలో ఉన్న పేరు ఒక్కటే అయినా దైర్యంగా రాహుల్ బయటికి వచ్చారు. జాతీయ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత పోరాడితే అంత బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని సెటైర్లు వెస్తున్నా తన పని తను చేసుకుంటు పొతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా లోకేష్ ఎంత ప్రచారం చేస్తే అంత టీడీపీ చేటు అనేది సొంత పార్టీ నేతల భావన.
కేవలం రాష్ట్రంలో ఎక్కడైనా టీడీపీ కార్యకర్తలు చనిపోతే అక్కడికి వెళ్లీ పరామర్శించి తన మీడియా ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతు కాలం వెలదీయడం తప్ప పార్టీకి లోకేష్ వల్ల ఉపయోగం లేదంటూన్నారు టీడీపీ వర్గాలు. చివరికి చరిత్రలో ఎప్పుడు ఓటమి ఎరుగని కుప్పం మునిసిపాలిటిలో కూడా టీడీపీ ఓడిపోయిందంటే కారణం లోకేష్ ప్రచారమే అనేది కుప్పం టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నా మాటలు.
ఏదో విధంగా లోకేష్ పాదయాత్ర చేయలనుకుంటూన్నా సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేక భావన వస్తోందంటే లోకేష్ ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతగా నమ్ముతున్నారో ఆర్ధం అవుతుంది. ఇప్పటికి కూడా చంద్రబాబునే నమ్ముకుని ఉంది టీడీపీ. సోనియా గాంధీ లాగా కొడుక్కు ప్రీ హ్యాండ్ ఇచ్చి ప్రజల్లోకి పంపిస్తే ఏదో రోజు తనపై ముద్రను తనే వదిలించుకుంటారు. చంద్రబాబే లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకపోతే కార్యకర్తలు ఎలా నమ్ముతారు. సో.. ఇప్పకైనా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ని ఫాలో అవ్వడం మంచిది.