బాలయ్య అన్ స్టాపబుల్ షో అన్నది పెద్ద హిట్. అందులో సందేహం లేదు. ఓ చాట్ షో చేయడం అన్నది బాలయ్యకు అదే ఫస్ట్ టైమ్. అందువల్ల ఎంత రెమ్యూనిరేషన్ అన్నది ఆయనకు అంతగా ఐడియా లేక జస్ట్ రెండున్నర కోట్లు మాత్రమే తీసుకుని ఆ షో చేసారట.
అదంతా గతం. ఇప్పుడు అన్ స్టాపబుల్ రెండో సీజన్ చేయాల్సి వుంది. ఇప్పుడు దీనికి ఎంత రెమ్యూనిరేషన్ అడుగుతారు అన్నది క్వశ్చను.
ప్రస్తుతం జై బాలయ్య షూటింగ్ బిజీలో వున్నారు. త్వరలో టర్కీ వెళ్లి అక్కడ యాక్షన్ సీన్లు, అలాగే బాలయ్య చేస్తున్న పాత్ర కు వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తున్న పాత్రకు మధ్య యాక్షన్ సీన్ల లాంటివి ఏవో చేయాల్సి వుందట. దాని తరువాత అన్ స్టాపబుల్ కు డేట్ లు కేటాయిస్తారని వినిపిస్తోంది.
అయితే ఈ లోగా రెమ్యూనిరేషన్ లెక్క కూడా తేలాల్సి వుంటుందని తెలుస్తోంది. అదే అసలు కీలకం అని. అది తేలాలి. డేట్ లు కేటాయించాలి. అప్పుడు గెస్ట్ లుగా ఎవరిని పిలవాలి అన్నది డిసైడ్ అవుతుందట.
అంటే చాలా కథ వుందన్నమాట. అన్ స్టాపబుల్ కు బ్యాకెండ్ లో బివిఎస్ రవి రచయితగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.