అఖండ సినిమా ప్రీ రిలీఙ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ బన్నీ. ఆ వేళ అదో సంచలనం. ఉత్తర – దక్షిణ ధృవాలు అనుకున్న రెండు క్యాంప్ లు కలిసిన పండగ రోజు. మళ్లీ మరోసారి అదే రిపీట్ కాబోతోంది. ఈసారి కూడా బన్నీనే దానికి నాంది పలుకుతున్నాడని తెలుస్తోంది.
అఖండ సినిమా సక్సెస్ సందర్భంగా బాలయ్య, బోయపాటి ఇంకా టీమ్ సభ్యులకు భారీ పార్టీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప రిలీజ్ ముందుగానే ఈ పార్టీ వుంటుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
గతంలో కూడా బన్నీ ఇలాంటి పార్టీలు ఇచ్చాడు. మంచి హిట్ అయిన సినిమాల యూనిట్ లను పిలిచి పార్టీలు ఇవ్వడం ఓ పద్దతిగా పెట్టుకున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేయబోతున్నాడన్న మాట.
బన్నీ పూర్తిగా తనదైన ప్లానింగ్ తో, తన దైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు. తను బాలయ్య ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లడం, పుష్ప ఫంక్షన్ కు మెగా స్టార్ ను కాకుండా రాజమౌళిని, కొరటాల ను గెస్ట్ లుగా పిలవడం, బాలయ్య కు పార్టీ ఇవ్వడం ఇవన్నీ పక్కా ఓ స్ట్రాటజీగా వెళ్తూ, మెగా ముద్రకు దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.