పవన్ మళ్లీ బ్రేక్ వేసారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అనుకోవాలో? కాదు అనుకోవాలో తెలియడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా వున్న సినిమా టికెట్ రేట్లను స్ట్రీమ్ లైన్ చేయాలనుకుంది. చంద్రబాబు హయాంలో అలా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అనుకోవాలో? కాదు అనుకోవాలో తెలియడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా వున్న సినిమా టికెట్ రేట్లను స్ట్రీమ్ లైన్ చేయాలనుకుంది. చంద్రబాబు హయాంలో అలా స్ట్రీమ్ లైన్ చేయకుండా, కోర్టుకు వెళ్లే అవకాశం ఇండస్ట్రీకి ఇచ్చేసి, అడ్డగోలుగా దోచుకోవడానికి చాన్స్ ఇచ్చేసారు.సినిమాను బట్టి అయిదువందలు, వెయ్యి ఇలా దోచేసారు. తొలివారం అంతా రెండు వందలు ఆ పైన యూనిఫారమ్ రేట్ పెట్టి దోచుకున్నారు.

ఇలాంటి నేపథ్యంలో పరిస్థితి వికటించి మొదటికే మోసం వచ్చింది.జ‌గన్ కు ఎవరు సలహా ఇచ్చారో కానీ, మరీ దారుణంగా రేట్లు తగ్గించేసారు. అవి సెట్ అవుతాయి అనుకున్న టైమ్ లో రిపబ్లిక్  ప్రీ రిలీఙ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓ లెవెల్ లో ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.దాంతో వ్యవహారం మొత్తం చెడిపోయిందని ఇండస్ట్రీ ఙనాలే మధనపడ్డారు. ఆ తరువాత డ్యామేఙ్ కంట్రోల్ కు సినిమా ఇండస్ట్రీ పెద్దలు నానా బాధలు పడ్డారు. మంత్రి నానిని కలిసి మళ్లీ పవన్ ను కలిసి అంతా సర్దుబాటు చేసారు.

అయినా రేట్లు రాలేదు కానీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసింది. ఆంధ్ర అంతటా 100 రూపాయల టికెట్ యూనిఫారమ్ రేటు మీద అమ్మేసినా ఏమీ పట్టించుకోలేదు. అఖండ సినిమాకు ఆంధ్ర అంతా ఏ ఊరు, ఏ థియేటర్, ఏ క్లాస్ అయినా వంద రూపాయలు అమ్మేసినా ఏమీ అడగలేదు. సీడెడ్ అయితే 150 రూపాయలు అమ్మేసినా పట్టించుకోలేదు. అందువల్ల అఖండ తొలివారం ఆంధ్రలో పాతిక కోట్ల వరకు చేయగలిగింది.

ప్రభుత్వం ఆ మాత్రం కోపరేట్ చేస్తోంది చాలు అని ఇండస్ట్రీ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో భారీ సినిమాలు పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్వామ్ విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో పవన్ మళ్లీ టికెట్ ల అంశాన్ని కెలికారు. తన ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికే ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించేసిందనే కొత్త ఆరోపణ చేసారు.

అవసరం అయితే తన సినిమాలు ప్రీగా వేస్తా అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఓటిటికి ఇవ్వడం కావచ్చు. ఓటిటి కి ఇవ్వడం అంటే ఫ్రీ అని కాదు. జ‌నాలు ఆ ఛానెల్ కు చందా కట్టాలి కదా. ఇప్పుడు ఆ సంగతి అలా వుంచితే ప్రభుత్వం ఇప్పుడు పవన్ మాటలు పట్టుకుని విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే విడుదల కాబోయే సినిమాల పరిస్థితి ఏమిటి?

ప్రభుత్వం కనుక చూసీ చూడనట్లు వదలకుంటే విడుదల కాబోయే సినిమాలు అన్నీ ఇబ్బందుల్లో పడతాయి. అంతా పవన్ బాబు ఘనతే అనుకోవాలి.