Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్యకు కరోనా!

బాలయ్యకు కరోనా!

కరోనా ఇంకా ప్రపంచాన్ని వీడిపోలేదు. ఈ డైలాగు తరచు వినిపిస్తూనే వుంది. ఈ మధ్య మెల్లగా చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

జంటనగరాల్లో వందల కేసులు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా మూడు నాలుగు వందల కేసులు వున్నాయని చెబుతున్నారు.

సీనియర్ హీరో బాలకృష్ణకు కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎక్కువగా జన సమూహంలోనే వుంటారు. అయితే షూటింగ్ లు లేదా రాజకీయాలు, బసవతారకం ఆసుపత్రి ఇలా ఫుల్ బిజీగా వుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది. 

కోవిడ్ పాజిటివ్ అయినా బాలయ్య ప్రస్తుతం ఏ లక్షణాలు లేకుండా ఆరోగ్యంగానే వున్నారని తెలుస్తోంది. అందువల్ల అభిమానులు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. 

బాలయ్య ప్రస్తుతం మైత్రీ మూవీస్ నిర్మించే జై బాలయ్య సినిమా చేస్తున్నారు. దాని తరువాత అనిల్ రావిపూడి 'బ్రో ఐ డోంట్  కేర్' సినిమా చేస్తారు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా