కార్తికేయ 2….ఆద్యంతం..ఆసక్తికరం

మైధాలిజికల్ మిస్టరీ జానర్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తికరంగా వుంటాయి. నమ్మకాలు..వాటి వెనుక సంఘటనలను ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథలు ఎప్పూడూ చూస్తుంటే థ్రిల్లింగ్ గా వుంటుంది.  Advertisement కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ కు…

మైధాలిజికల్ మిస్టరీ జానర్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తికరంగా వుంటాయి. నమ్మకాలు..వాటి వెనుక సంఘటనలను ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథలు ఎప్పూడూ చూస్తుంటే థ్రిల్లింగ్ గా వుంటుంది. 

కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ కు సీక్సెల్ గా తయారుచేస్తున్న సినిమా కార్తికేయ 2. దేన్నయినా హేతుబద్ధంగా ఆలోచించే హీరో మరోసారి మరో వ్యవహారాన్ని చేధించడం అన్నది సీక్వెల్ ఐడియా.

పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ కలిసి దాదాపు ముఫై కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన సినిమా. నిఖిల్ మీద 30 కోట్లకు పైగా ఖర్చుచేయడం అంటే ఆ పాన్ ఇండియా సబ్జెక్ట్ ను నమ్మే. ద్వారక, కృష్ణుడు నేపథ్యంలో దాదాపు ఇరవై ముఫై టఫ్ లొకేషన్లలో చిత్రీకరించారు.

ఇప్పుడు విడుదల చేసిన ట్రయిలర్ ఆ విషయాలు అన్నీ స్పష్టం చేస్తోంది. సినిమా నిర్మాణానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారని క్లారిటీగా తెలుస్తోంది. ట్రయిలర్ ఆద్యంతం ఇంట్రస్టింగ్ గా వుంది. వచ్చే నెల 22న విడుదలవుతున్న ఈ సినిమాలో నిఖిల్..అనుపమ పరమేశ్వరన్.. అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. కాలభైరవ సంగీతం…విశ్వప్రసాద్,,అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. చందు మొండేటి దర్శకుడు.