బాలయ్యను..చిరును అడిగే ధైర్యం లేదా

నిర్మాత అశ్వనీదత్ సంక్రాంతి సినిమాల విషయంలో చేసిన కామెంట్ల మీద టాలీవుడ్ లో పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మైత్రీ మూవీస్ ను కామెంట్ చేయడం ముమ్మాటికీ తప్పే. ఎందుకంటే మైత్రీ మూవీస్ సంస్థ…

నిర్మాత అశ్వనీదత్ సంక్రాంతి సినిమాల విషయంలో చేసిన కామెంట్ల మీద టాలీవుడ్ లో పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మైత్రీ మూవీస్ ను కామెంట్ చేయడం ముమ్మాటికీ తప్పే. ఎందుకంటే మైత్రీ మూవీస్ సంస్థ రెండు పెద్ద సినిమాలను సంక్రాంతికి ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో ఇప్పటికే మీడియాలో కథలు కథలుగా వార్తలు వచ్చాయి. అలాగే ఇండస్ట్రీ జనాలు అందరికీ తెలుసు.

రెండు సినిమాల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగకపోవడం, సంక్రాంతినే తప్పని సరి కావడం, ముందుగా మెగాస్టార్ కు మాటివ్వడం, తరువాత బాలయ్య కూడా సంక్రాంతిని ఛూజ్ చేసుకోవడం ఇవన్నీ కలిసి మైత్రీ మూవీస్ ను ఈ దిశగా నడిపించాయి అన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. పైగా ఇలా చేయడం వల్ల మైత్రీ మూవీస్ సంస్థ దాదాప పది పదిహేను కోట్ల మేరకు నష్టపోతోందని ట్రేడ్ వర్గాల బోగట్టా.

ఇలాంటి నేపథ్యంలో అక్కడి మైత్రీ సంస్థనే ఉబలాటపడి సంక్రాంతికి రెండు సినిమాలు విడుదల చేస్తోందని అశ్వనీదత్ అనడం పక్కా మీనింగ్ లెస్ కాక మరేంటీ? పైగా వారసుడు సినిమా నిర్మాత దిల్ రాజు. గిల్డ్ సమ్మె సినిమా టైమ్ లో ఆయన పదే పదే తనది డబ్బింగ్ సినిమా అని చెప్పి, షూటింగ్ కొనసాగించారు. ఇప్పుడు తెలుగు నిర్మాత తీసిన సినిమా అనే కొత్త వాదనను అశ్వనీదత్ తీసుకువచ్చారు.

మైత్రీ మూవీస్ తన రెండు సినిమాలను దిల్ రాజుకు ఇటు నైజాంలో కానీ, అటు వైజాగ్ లో కానీ ఇవ్వకుండా తనే పంపిణీ చేసుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో అశ్వనీదత్ కామెంట్లు దిల్ రాజును సపోర్ట్ చేస్తూ, మైత్రీ మూవీస్ ను విమర్శించడం విశేషం. మైత్రీ మూవీస్ ను అడిగే బదులు తనకు సన్నిహితమైన చిరు ను లేదా బాలయ్యను అడగొచ్చు కదా అశ్వనీదత్..ఎవరో ఒకర్ని వాయిదా వేసుకోమని..ఆ ధైర్యం లేదేమో?