cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య పడ్డ కష్టం ఇంతా అంతా కాదు

బాలయ్య పడ్డ కష్టం ఇంతా అంతా కాదు

అఖండ సినిమా కోసం హీరో బాలకృష్ణ పడ్డ కష్టం ఇంతా అంతా కాదు అన్నారు ఆ సినిమాకు సంగీతం అందించిన థమన్. 

ఈ వయసులో యాక్షన్ సీన్ల కోసం రెండు మూడు బెల్ట్ లు కట్టించుకుని, ఇటు అటు లాగించుకుని, కిందా మీదా పల్టీలు కొట్టడం అంటే చాలా రిస్క్ అయిన పని అని, అలాంటి సీన్లు బాలయ్య చేసారని చెప్పాడు.

అంతే కాదు, వేడి లైట్ల నడుమ వంటి నిండా విబూది నామాలు పెట్టుకుని, భారీగా గొలుసులు, దండలు ధరించి, చాలా చికాకు పెట్టే ఆహార్యాన్ని భరించి నటించారని, రోజల్లా అదే గెటప్ లో అలా వుండడం అంటే సామాన్యమైన విషయం కాదు అని ఆయన వెల్లడించారు. 

బోయపాటి చాలా కసిగా అఖండ సినిమాను తెరకెక్కించారని, సినిమాను థియేటర్ లో చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని ఆయన అన్నారు. 

ఇలాంటి సినిమాలో మాస్ పాటలు, ఐటమ్ సాంగ్ లకు అవకాశం లేదని, అయినా ఓ మాంచి బీట్ సాంగ్ చేసామని అన్నారు. ఇప్పటికి రెండు పాటలు బయటకు వచ్చాయని, మరో రెండు పాటలు 27న విడుదల చేస్తామని తెలిపారు. 

భీమ్లానాయక్ లో అయిదు పాటలు వుంటాయని, అలాగే సర్కారు వారి పాట న్యూ ఇయర్ గిఫ్ట్ గా వస్తుందని, శంకర్-రామ్ చరణ్ సినిమాలో మూడు పాటలు రెడీ అయిపోయాయని థమన్ తెలిపారు. 

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!