అదేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ని మెచ్చడం ఏంటి అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. కానీ టీడీపీ నేతలు అయితే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మూడు రాజధానుల మీద చేసిన చట్టాన్ని జగన్ సర్కార్ రద్దు చేయడంతో తమ్ముళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
ఇది రైతు విజయం అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు అంటే, అమరావతే అసలైన రాజధాని అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. మొత్తానికి జగన్ సర్కార్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని భీమిలీకి చెందిన టీడీపీ నేత గంటా నూకరాజు చెబుతున్నారు.
ఇక మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అయితే తమ పార్టీ ఒకే రాజధాని కోసమే పోరాడుతూ వచ్చిందని, ఇపుడు అది నెరవేరుతోందని చెబుతోంది. ఇలా సంబరాలు జరుపుకుంటున్న తమ్ముళ్ళు మళ్ళీ కొత్త బిల్లుని జగన్ సర్కార్ తీసుకురావద్దని డిమాండ్ చేయడం విశేషం.
తీసుకువచ్చినా మళ్లీ ఇలాగే అవుతుందని, కోర్టులలో నిలబడవని కూడా చెబుతున్నారు. మొత్తానికి జగన్ మూడు రాజధానుల చట్టం రద్దు అనగానే టీడీపీ నేతలకు ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. మరి ఈ ఆనందాన్ని జగన్ అలాగే ఉంచుతారా లేక కొత్త బిల్లుతో వస్తారా అన్నది వెయిట్ అండ్ సీ.