సినిమాల్లేవు కాబట్టి ఇలా వచ్చావా బాలయ్య!

ఏమాటకామాట చెప్పుకోవాలి, కొన్ని విషయాల్లో బాలకృష్ణ చాలా క్లియర్ గా ఉంటాడు. చేతిలో సినిమాలు ఉంటే అస్సలు రాజకీయాల్ని పట్టించుకోడు. సినిమాలు లేక ఖాళీగా ఉంటే మాత్రం పొలిటికల్ గా కాస్త హడావుడి చేయడానికి…

ఏమాటకామాట చెప్పుకోవాలి, కొన్ని విషయాల్లో బాలకృష్ణ చాలా క్లియర్ గా ఉంటాడు. చేతిలో సినిమాలు ఉంటే అస్సలు రాజకీయాల్ని పట్టించుకోడు. సినిమాలు లేక ఖాళీగా ఉంటే మాత్రం పొలిటికల్ గా కాస్త హడావుడి చేయడానికి ప్రయత్నిస్తాడు. గడిచిన ఆరేళ్లుగా బాలయ్య వ్యవహార శైలి ఇదే. ఈసారి కూడా బాలయ్య ఇలానే వ్యవహరించాడు. చేతిలో సినిమాల్లేవు కాబట్టి అమరావతి రైతులు గుర్తొచ్చారు ఈ పార్ట్ టైమ్ పొలిటీషియన్ కి.

రూలర్ డిజాస్టర్ తో బాలయ్య-బోయపాటి కాంబోలో రావాల్సిన సినిమా డైలమాలో పడింది. బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిందని కొందరంటారు. స్క్రిప్ట్ లో మార్పుచేర్పుల వల్ల మాత్రమే ఆలస్యమౌతోందని మరికొందరంటారు. ఎవరేమన్నా ప్రస్తుతానికైతే బాలయ్య చేతిలో సినిమా లేదు. అందుకే ఆయన అమరావతి రైతుల్ని పరామర్శించే ప్రొగ్రామ్ పెట్టుకున్నారు. పైగా బావ చంద్రబాబు ఆదేశాలు ఉండనే ఉన్నాయి.

కేవలం 3-4 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలకు సకుటుంబ సపరివార సమేతంగా హాజరవుతున్నారు చంద్రబాబు. భార్యతో కలిసి ఇప్పటికే రౌండ్స్ వేశారు. నారా రోహిత్ ను కూడా రంగంలోకి దింపారు. అశ్వనీదత్ లాంటి సినీప్రముఖుడ్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు బాలయ్యను దింపుతున్నారు.

ఈరోజు తన కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేష్ తో కలిసి షో చేయబోతున్నారు బాలయ్య. ఎప్పట్లానే దీనికి కూడా బాబు మీడియా బాకా ఊదడానికి సిద్ధమైపోయింది. బాలయ్య మాట్లాడబోయేది ఎవ్వరికీ అర్థంకాదని అందరికీ తెలుసు. లోకేష్ మాట్లాడితే అనర్థాలు జరిగిపోతాయని తెలుసు. కానీ ఏదో జరిగిపోతోందని కలరింగ్ ఇవ్వాలి. అందుకే ఈ హంగామా అంతా. అన్నట్టు, ఇదంతా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లినంత వరకే. ఒక్కసారి బోయపాటి సినిమా స్టార్ట్ అయితే, బాలయ్య మళ్లీ అజ్ఞాతవాసి అయిపోవడం పక్కా.