బాలయ్య ట్విట్టర్ లోకి రావాలి

ఫంక్షన్ కు పిలవాలంటే ఆప్షన్ మెగాస్టార్…ఓ ట్వీట్ వేయాలన్నా, మంచి సినిమాను ఎంకరేజ్ చేయాలన్నా మెగాస్టార్. ఇది అంతా ఒకప్పుడు ఇప్పుడు ఈ ట్రెండ్ కొంచెం మారుతోంది.  Advertisement యంగ్ జ‌నరేషన్ అందరితో చాలా…

ఫంక్షన్ కు పిలవాలంటే ఆప్షన్ మెగాస్టార్…ఓ ట్వీట్ వేయాలన్నా, మంచి సినిమాను ఎంకరేజ్ చేయాలన్నా మెగాస్టార్. ఇది అంతా ఒకప్పుడు ఇప్పుడు ఈ ట్రెండ్ కొంచెం మారుతోంది. 

యంగ్ జ‌నరేషన్ అందరితో చాలా దగ్గరగా వుంటున్నారు నందమూరి బాలకృష్ణ. అన్ స్టాపబుల్ చాట్ షో కొంత వరకు కలసి వచ్చింది. అల్లు అరవింద్ తో ఫ్రెండ్ షిప్ పెరిగింది. దాంతో అల్లు శిరీష్ ఫంక్షన్ కు వచ్చారు. కొత్త సినిమాలు చూసి భుజం తట్టడం కూడా అలవాటు చేసుకున్నారు. లేటెస్ట్ గా అడవి శేష్ హిట్ 2 కి బాలయ్య ప్రశంసలు దక్కాయి.

ఈ విషయంలో మెగాస్టార్ ఇటీవల బాగా వెనుకపడ్డారు. ఆచార్య ఫెయిల్యూర్ తరువాత మెగాస్టార్ కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కేవలం ట్విట్టర్ లో మాత్రం కాస్త యాక్టివ్ గా వున్నారు. కానీ బాలయ్య మాత్రం ఆ విషయంలో వెనక్కు వున్నారు. ట్విట్టర్ మీద బాలయ్య కు ఎందుకో ఆసక్తి లేదు. ఆయన టీమ్ చెప్పినా బాలయ్య నో అన్నారు తప్ప ఎస్ అనలేదని బోగట్టా. ఫేస్ బుక్ అక్కౌంట్ వున్నా అది కేవలం క్యాన్సర్ ఆసుపత్రి ఫొటొలకే పరిమితం అయింది.

ఇలాంటి టైమ్ లో బాలయ్య ట్విట్టర్ లోకి వస్తే భలేగా వుంటుంది. అసలే రానున్నవి రాజ‌కీయాల రోజులు. మరోపక్క టాలీవుడ్ లో అందరివాడు ట్యాగ్ ఇటు మెగాకు అటు నందమూరికి మధ్య అటు ఇటు ఊగుతోంది. ఇలాంటి టైమ్ లో బాలయ్య ట్విట్టర్ లోకి వస్తే ఎడ్జ్ తీసుకున్నట్లు అవుతుంది.