మెగా నిర్మాత అల్లు అరవింద్ కు నందమూరి బాలకృష్ణ మీద ప్రేమ పొంగి పొరలుతోంది. బావ మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ లో చకచకా సినిమాలు చేస్తున్నా, అటు కన్ను వేయని అల్లుఅరవింద్ ఇటు నందమూరి బాలయ్యతో మాత్రం సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారని బోగట్టా.
ఆహా కోసం బాలయ్య ను సక్సెస్ ఫుల్ గా రంగంలోకి దించారు. మాంచి ఫలితాలు సాధించారు. బన్నీ కూడా బాలయ్యతో మాంచి ర్యాపోలో వున్నారు. ఇప్పుడు అదే తీరున మరింత ముందుకు వెళ్లి బాలయ్య సినిమా నిర్మించాలనే ప్రయత్నంలో పడ్డారు.
నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేసిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు మల్లిడి వశిష్ఠ్ కు ఇప్పటికే అయిదులక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆరు నెలలు రిటైర్ అవుతారు అనగా ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయకూడదు. ఆ రూల్ ను ఆసరాగా తీసుకుని ఓ పోలీస్ అధికారి అవినీతిని, రౌడీ ఇజాన్ని ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్ తో అల్లిన కథ ఏదో వుందని వినిపిస్తోంది.నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార పార్ట్ 2 అయిన తరువాత ఈ ప్రాజెక్టు వుండే అవకాశం వుంది.
ఈ కథను బాలయ్యకు వినిపించి ఒకె అనిపించే ప్రయత్నాల్లో అరవింద్ వున్నారని తెలుస్తోంది. గీతా బ్యానర్ లో మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. బాలయ్యతో ప్రయత్నిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. ఏమైనా టాలీవుడ్ లో కొత్త కొత్త ఈక్వేషన్లు క్రాప్ అవుతున్నాయి.