సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కాస్త అభిమానం వుంది. వైవిధ్యమైన నటన కనబర్చే నటుడు అతగాడు.
విష్వక్ సేన్ తెలుగులో తనకంటూ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ ను తయారు చేసుకునే ప్రయత్నంలో వున్న హీరో.
వీళ్లద్దరి కాంబినేషన్ లో సినిమా. అది కూడా అర్జున్ డైరక్టర్..విష్వక్ హీరో. అర్జున్ స్వంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15 సినిమా తెలుగులో నిర్మిస్తున్నారు. అర్జున్ నిర్మించే ఈ సినిమాతో ఆయన కుమార్తె ఐశ్వర్య తెలుగులో కథానాయికగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే కన్నడ రంగానికి పరిచయం అయింది ఐశ్వర్య.
రోడ్ మూవీ కాన్సెప్ట్ తో తయారు కాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అర్జున్ ది..జగపతిబాబుది చిరకాల స్నేహం. అందుకే ఆయన కూడా ఈ ప్రాజెక్టులో చేరారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.