హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ నీటి పాములు

కొన్నేళ్ల కిందటి సంగతి.. హరీష్ శంకర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు నిర్మాత బండ్ల గణేశ్. హరీశ్ కు సంస్కారం లేదన్నాడు. అతడికి పవన్ సినిమాను డైరక్ట్ చేసే అవకాశం తన వల్ల…

కొన్నేళ్ల కిందటి సంగతి.. హరీష్ శంకర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు నిర్మాత బండ్ల గణేశ్. హరీశ్ కు సంస్కారం లేదన్నాడు. అతడికి పవన్ సినిమాను డైరక్ట్ చేసే అవకాశం తన వల్ల వచ్చిందన్నాడు. దీనికి హరీష్ కూడా కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఆ టైమ్ లో వీళ్లిద్దరూ బద్ధ శత్రువులయ్యారు.

ఆ తర్వాత కొన్ని రోజులకే బండ్ల గణేశ్ మాటమార్చారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు పోట్లాడుకోరా.. ఆ తర్వాత కలిసిపోరా అంటూ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు మరోసారి గత వివాదాన్ని స్వయంగా తానే గుర్తుచేశాడు బండ్ల గణేశ్. తను, హరీశ్ శంకర్ నీటి పాముల్లాంటి వాళ్లమని అన్నాడు. తమకు కోపాలుంటాయి కానీ పగలుండవని కవర్ చేశాడు.

“కోపానికి, పగకి తేడా ఉంది. కోప్పడేవాడు హానికరం కాదు. కోపం అనేది నీటిపాము లాంటిది. అది కరిచినా ఫర్వాలేదు. పగ అనేది నాగుపాము లాంటిది. మేమంతా నీటిపాముల్లాంటోళ్లం. కోప్పడే బ్యాచ్. ఏదేదో మాట్లాడుతుంటాం కానీ ఏదీ మనసులో పెట్టుకోం. ఆ క్షణానికి అదైపోవాలి. అంతే తప్ప మాకు ఇగోలుండవు.”

ఏడేళ్లుగా సినిమా తీయకపోవడం బాధగా ఉందన్నాడు బండ్ల గణేశ్, ఆ విషయంలో తను తప్పు చేశానని, అంతా తనను క్షమించాలని కోరాడు. ఇకపై తను సినిమాల్లోనే ఉంటానని, సినిమానే తన జీవితమని ప్రకటించిన బండ్ల.. భవిష్యత్తులో హరీశ్ శంకర్ తో కచ్చితంగా సినిమా చేస్తానంటున్నాడు.

 

6 Replies to “హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ నీటి పాములు”

Comments are closed.