ఇతర పార్టీల్లో కంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఫ్రీడమ్ ఎక్కువ అంటారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య కూడా ఇదే మాట అన్నారు. పార్టీ నాయకులే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. అనుచితమైన కామెంట్స్ చేస్తారు. ఏదీ దాపరికం ఉండదు. బహిరంగంగానే మాట్లాడతారు.
అలా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలం అండ్ బలహీనత అని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. సామాన్య జనం హస్తం పార్టీలో క్రమశిక్షణ ఉండదని అంటారు. ఇది నిజమే అనే అభిప్రాయం కలగడానికి అనేక సంఘటనలు జరిగాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే పార్టీలో కొంత వ్యతిరేకత వచ్చింది. చేరిన కొంత కాలానికే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
పీసీసీ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు చాలామంది సీనియర్లు మండిపడ్డారు. ఎందుకంటే …రేవంత్ పార్టీలో చాలా జూనియర్ కాబట్టి. అందులోనూ టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, సోనియాగాంధీ మీద తీవ్ర విమర్శలు చేసిన చరిత్ర ఉంది. రేవంత్ కు పదవులు ఇచ్చినప్పుడు కష్ట నష్టాల్లో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి అన్యాయం జరిగిందని సీనియర్లు గగ్గోలు పెట్టారు.
అలాంటి వారిలో కోమటిరెడ్డి సోదరులు ప్రధానమైనవారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ ని తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీలో చేరిపోయాడు. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ సమయంలోనే అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడిని గెలిపించాలని పిలుపునిచ్చాడు. రేవంత్ రెడ్డి బీజేపీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతుంటే వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సహకరించకుండా అమెరికా వెళ్ళిపోయాడు.
ఆయనకూ రేవంత్ పట్ల మొదటినుంచి వ్యతిరేకత ఉంది. కానీ అప్పట్లో మునుగోడులో గులాబీ పార్టీ విజయం సాధించడం, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. విజయం సాధించాడు. రేవంత్ రెడ్డి సీఎం కావడం చాలామంది సీనియర్లకు ఇష్టం లేదు. దాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. రేవంత్ కు ఇదంతా తెలుసు.
అందుకే తనను వ్యతిరేకించిన సీనియర్లందరినీ కలుపుకొనిపోయాడు. గతం వదిలేశాడు. వాళ్ళని వ్యతిరేకించి తాను మనుగడ సాగించలేనని తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి ఆశించినట్లుగా మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. ఒకే జిల్లాకు చెందిన అన్నదమ్ములకు ఇస్తే ఇతర నాయకుల్లో అసంతృప్తి వస్తుంది కాబట్టి ఇవ్వకపోవచ్చు లేదా పార్టీ నుంచి బీజేపీలో చేరి మళ్ళీ వచ్చాడు కాబట్టి ఇవ్వకపోవచ్చు.
కారణాలు ఏమైనా రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నాడు. ఏదో విధంగా ఆ అసంతృప్తి బయటకు వెళ్ళగక్కాలి. దీంతో భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పాడు. ఇప్పటికే సీఎం కావాల్సింది కానీ ఆ ఛాన్స్ మిస్సయిందని అన్నాడు. తన నాలిక మీద పుట్టుమచ్చ ఉంది కాబట్టి తాను చెప్పింది నిజమవుతుందని అన్నాడు.
అంటే రేవంత్ సీఎంగా ఉండే అవకాశం లేదని చెబుతున్నాడా? ఆయన ఆంతర్యం ఏమిటి? రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లా సోదరులు ఎసరు పెడతారని గులాబీ పార్టీ నాయకులు ఇదివరకోసారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలు పూర్తి కాలం పనిచేయని చరిత్ర ఉంది. అది రిపీట్ అవుతుందా?
Call boy works 8341510897
Hello kumar.g
Asper hurun global top millioneer-2024 list in Telugu states these r top5..
Divi labs, megha pichi Reddy, p Krishna Reddy , Partha sarathi Reddy, Aparna MD subramanya Reddy…
See almost who r there in this list ?
Top 10 is also reddies but they will so mud slinging on other communities
తప్పా అందరూ నాలుక మందం వారె ..మీ నియొజక వర్గం దాటి ఇంకొకడిని గెలిపించె సత్తా వుందా ?
తప్పొ వొప్పొ అనర్గలళంగా మాట్లాడి ప్రజలను కన్విన్స్ చెసె మాట తీరు మీలొ ఎవరికి అయినా వుందా రాజా గొపాలం
vc estanu 9380537747
ఈ మచ్చన్న మహానుభావుడు తనకు తానుగా మునుగోడు లో గెలిపించుకోలేకపోయాడు గాని , ఈయనొచ్చి ఆ మచ్చలతో ఉత్తమ కుమార్ రెడ్డిని గెలిపిస్తాడంట, ఈయన పనికిరాని మచ్చలు ఆయనకి ఎలా పనికి వస్తాయి?