Advertisement

Advertisement


Home > Movies - Movie News

బందోబస్త్ ఆల్ రౌండ్ ఎంటర్ టైనర్-సూర్య

బందోబస్త్ ఆల్ రౌండ్ ఎంటర్ టైనర్-సూర్య

వైవిధ్యమైన సినిమాలు చేసే హీరో సూర్య  నటించిన తాజా సినిమా 'బందోబస్త్'. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా హీరో సూర్య  మట్లాడుతూ ఈ 'బందోబస్త్' కంప్లీట్ ఎంటర్టైనర్ ఫిల్మ్. మీ అందరికీ నచ్చుతుంది. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి కెవి ఆనంద్ వచ్చారు. రియల్, ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన సినిమాలు తీస్తారు. ఈ సినిమానూ అలాగే తీశారు. ఇందులో నేను చేసిన పాత్ర నాకు చాలా కొత్త. నాకు కొత్త ఎక్స్ పీరియన్స్. నేను ఈ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) కమాండోగా చేశా.  'బందోబస్త్' సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే ఇవ్వదు, ఇంతకు ముందు ఎన్నడూ సినిమాల్లో చూడని కొత్త వాతావరణంలోకి ప్రేక్షకులనుతీసుకు వెళుతుంది అని అన్నారు. 

అనంతరం డి. సురేష్ బాబు మాట్లాడుతూ "లైకా ప్రొడక్షన్స్ కు, తెలుగులో విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్. మా నాన్నగారి సినిమాల్లో వాళ్ళ నాన్నగారు నటించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో నాకు తెలియదు. మంచి మనిషి. వాళ్ళది లవ్లీ ఫ్యామిలీ. తనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని అన్నారు. 

ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ "లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు మాకోసం 'స్పైడర్'ను తమిళనాడులో విడుదల చేశారు. భారీ ఎత్తున విడుదల చేసి, మాకు బ్రహ్మాండమైన బిజినెస్ చేసి పెట్టారు. వాళ్ల బ్యానర్ మాకు ఎంతో సపోర్ట్ చేసింది. అప్పటి నుండి వాళ్ల సినిమాలు అన్నిటినీ తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. తమిళనాడులో టాప్ హీరోలు, టెక్నీషియన్లు ఈ బ్యానర్ లో చేశారంటే ఈ బ్యానర్ గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు " అని అన్నారు.

దర్ళకుడు కెవి ఆనంద్ నటులు ఆర్య, సాయేషా, అతిధులు భోగవిల్లి ప్రసాద్, గౌతమ్ తిన్ననూరి, రచయిత వనమాలి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?