చూస్తుంటే హీరో నాగ శౌర్యకు ప్యాక్ ల మీద దృష్టి బాగా పట్టేసినట్లుంది. సిక్స్ ఫ్యాక్ నుంచి ఎయిట్ ప్యాక్ కు చేరిపోయాడు.
వాస్తవానికి ఓ సినిమ కోసం వర్కవుట్ లు స్టార్ట్ చేసాడు. విలువిద్య నేపథ్యంలో నిర్మించే సినిమా అది. కానీ అక్కడితో ఆగకుండా సిక్స్ ప్యాక్ వుంటే బాగుందని ఆ దిశగా వెళ్లాడు.
ఇప్పుడు అక్కడితో ఆగకుండా ఎయిట్ ప్యాక్ ఫిట్ నెస్ సాధించాడు. నిజానికి శౌర్య చాక్ లేట్ బాయ్ లా బబ్లీగా, లవ్ లీగా వుంటాడు. చేస్తున్న సినిమాల్లో అలాంటి లుక్ వున్న సినిమాలు కూడా వున్నాయి. కానీ శౌర్య ఎందుకో ఈ ఫిజికల్ ఫిట్ నెస్ లుక్ నే ఎక్కువ ఇష్టపడుతున్నట్లుంది.
ఇప్పుడు లేటెస్ఠ్ గా ఈ లుక్ కు కౌబాయ్ గెటప్ యాడ్ చేసి ఓ స్టిల్ ను సోషల్ మీడియాలోకి వదిలాడు. చూసిన వాళ్లంతా వావ్..శౌర్య అంటూ మెసేజ్ లు కామెంట్లు పెడుతున్నారు.