బరిలోకి సుశాంత్ కూడా

టాలీవుడ్ కు ధీమా వచ్చింది. థియేటర్ల దగ్గర పరిస్థితులు చిన్న సినిమాలకు అనుకూలంగా వున్నాయని క్లారిటీ వచ్చింది. దాంతో ఆ రేంజ్ సినిమాలు అన్నీ క్యూ కడుతున్నాయి.  Advertisement ఇప్పటికే పాగల్, రాజరాజచోర, క్రేజీ…

టాలీవుడ్ కు ధీమా వచ్చింది. థియేటర్ల దగ్గర పరిస్థితులు చిన్న సినిమాలకు అనుకూలంగా వున్నాయని క్లారిటీ వచ్చింది. దాంతో ఆ రేంజ్ సినిమాలు అన్నీ క్యూ కడుతున్నాయి. 

ఇప్పటికే పాగల్, రాజరాజచోర, క్రేజీ అంకుల్స్, కనబడుటలేదు లాంటి సినిమాలు డేట్ లు లాక్ చేసాయి. ఈ నెల 27న విడుదలకు సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ రెడీ అయింది. సోలో విడుదల వుంటుందనుకుంటే మరో సినిమా వస్తోంది. 

సుశాంత్ నటించిన ఇచ్చట వాహనమలు నిలుపరాదు సినిమాను కూడా అదే డేట్ కు లాక్ చేసారు. నిజానికి వారానికి ఒక సినిమా వుంటే చిన్న సినిమాలకు వర్కవుట్ అవుతుంది. కానీ రాను రాను పెద్ద సినిమాలు బరిలోకి దిగుతాయి. మళ్లీ డేట్లు దొరకవని చిన్న సినిమాలు తొందరపడుతున్నాయి.

కానీ దీనివల్ల ఎవరికి వర్కవుట్ అవుతుందో, ఎవరికి వర్కవుట్ కాదో అన్నది చూడాల్సి వుంది. టైమ్ తక్కువ వుండడంతో కాస్త గట్టిగా పబ్లిసిటీ చేయాల్సి వుంటుంది. కంటెంట్ వదలాల్సి వుంటుంది కూడా. మొత్తం మీద టాలీవుడ్ సినిమాల విడుదల హడావుడి మాత్రం పెరిగింది.