హీరోయిన్లకు అందం ఎంత ఇంపార్టెంటో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. ఎంత అందం ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాకపోతే కెరీర్ కష్టం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారింది మాళవిక శర్మ. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆమెకు సక్సెస్ రాకపోవడం బాధాకరం.
నేల టికెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మాళవిక శర్మ. ఆ సినిమా ఫెయిలైంది. అలా తొలి సినిమాతోనే ఫ్లాప్ తెచ్చుకున్నప్పటికీ, ఆమె అందం ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టింది. అలా రెడ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా కూడా ఫెయిల్ అవ్వడంతో మాళవిక శర్మ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అయినప్పటికీ తన హాట్ ఫొటోషూట్స్ తో ఆమె ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేసింది.
ఈసారి భీమ సినిమాలో అవకాశం దక్కించుకుంది. కెరీర్ లో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన భీమతో సక్సెస్ అందుకోవాలనుకున్న మాళవిక ఆశలు నెరవేరలేదు. అయినప్పటికీ ఆమె అధైర్యపడలేదు. ఎందుకంటే, అప్పటికే ఆమె హరోంహర సినిమాకు సైన్ చేసింది.
కానీ ఇప్పుడా సినిమా జాతకం కూడా తేలిపోయింది. సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమా థియేటర్లలో నిలదొక్కుకోలేకపోయింది. దీంతో మాళవిక కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ఎందుకైనా మంచిదని ఆమె లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇకపై పూర్తిస్థాయిలో దానిపై దృష్టిపెడుతుందేమో.