Advertisement

Advertisement


Home > Movies - Movie News

బెల్లంకొండ చిన్న హీరోకి మరో సినిమా

బెల్లంకొండ చిన్న హీరోకి మరో సినిమా

తొలి సినిమా సగంలో ఆగిపోయిన చాన్నాళ్లకు బెల్లంకొండ చిన్న హీరో గణేష్ కు మరో సినిమా దొరికింది. అది ప్రస్తుతం నిర్మాణంలో వుంది. 

సితార బ్యానర్ మీద ఈ సినిమాను కొత్త దర్శకుడి సారథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా వుంటే మరో సినిమా ఫిక్స్ అయింది.

నాంది సినిమా నిర్మించి సతీష్ వేగిశ్న నిర్మాణంలో మరో సినిమా బెల్లంకొండ గణేష్ కు దొరికింది. ఈ సినిమాకు దర్శకుడు కృష్ణ చైతన్య.కథ అందిస్తున్నారు. కోత్త దర్శకుడు పని చేస్తారు. 

గతంలో నితిన్ తొ త్రివిక్రమ్, పవన్ అందరూ కలిసి నిర్మించిన సినిమాను అందించిన కృష్ణ చైతన్యనే. వాస్తవానికి నితిన్ తో పవర్ పేట సినిమా చేయాల్సి వుంది. కొన్ని కారణాల వల్ల అది ఆగింది.

వేరే సబ్జెక్ట్ తో ఇప్పుడు బెల్లంకొండ గణేష్ తో సినిమా ఫిక్స్ అయింది. నాంది సినిమా సక్సెస్ మీద వున్న ప్రొడ్యూసర్ సతీష్ వేగశ్న ఈ సినిమాను త్వరలో స్టార్ట్ చేసే ప్రయత్నంలో వున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?