Advertisement

Advertisement


Home > Movies - Movie News

'గల్లా' వారి 'హీరో'

'గల్లా' వారి 'హీరో'

మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ నటిస్తున్న సినిమా టైటిల్ బయటకు లీక్ అయిపోయింది. రేపు ఉదయం ఈ టైటిల్ ను హీరో మహేష్ బాబు విడుదల చేయబోతున్నారు. 

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ' హీరో ' అంట. ఈ టైటిల్ కొత్తదేమీ కాదు. అరిగిపోయిన టైటిల్ నే. హిందీలో వాడేసారు. తెలుగులో కూడా నితిన్ ఈ టైటిల్ తో ఓ సినిమా చేసాడు.

అయితే ఈ టైటిల్ అయితేనే కిక్ వుంటుందని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పట్టుబట్టి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ముందు నిర్మాత దిల్ రాజు స్టార్ట్ చేసారు. 

కానీ కొన్ని కారణాల వల్ల వదిలేసారు. ఇప్పుడు గల్లా ఫ్యామిలీనే స్వంతగా నిర్మిస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?