Advertisement

Advertisement


Home > Movies - Movie News

భీష్మ.. ఇది పూర్తిగా ప్రేమకథ కాదు

భీష్మ.. ఇది పూర్తిగా ప్రేమకథ కాదు

సింగిల్స్ ఏంథెమ్ లోనే భీష్మ స్టోరీ అర్థమైపోతుంది. టీనేజ్ నుంచి సింగిల్ ఉన్న నితిన్ మింగిల్ అవ్వడానికి తెగ ట్రై చేస్తుంటాడు. కానీ ఏ పిల్ల పడదు. ఫైనల్ గా ఆఫీస్ లో రష్మిక కనెక్ట్ అవుతుంది. ఆమెను ఎలా ఇంప్రెస్ చేసి తనదాన్ని చేసుకున్నాడనేది ఈ సినిమా స్టోరీ.

అందరికీ ఇంతవరకు మాత్రమే తెలుసు. కానీ భీష్మ వెనక కూడా ఓ బలమైన కాన్సెప్ట్ ఉందంటున్నాడు నితిన్. మరీ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం అనే టాపిక్ ను ఈ సినిమాలో చర్చించామంటున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత నాగవంశీతో కలిసి గ్రేట్ ఆంధ్రకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

"ఎలాగైనా అమ్మాయిని పడేయాలనేది కసితో ఉంటాడు హీరో. అలాంటి టైమ్ లో రష్మిక కనిపిస్తుంది. ఆమెను ఎలా ఇంప్రెస్ చేశాడనే విషయాన్ని సరదాగా చూపించాం. ఇది బాటమ్ లైన్. దీని అప్పర్ సర్కిల్ లో సినిమాకు ఇంకో లేయర్ ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాం. సినిమాలో ఆ మెసేజ్ కూడా ఉంటుంది."

సేంద్రియ సేద్యం అనే సందేశాన్ని సినిమాలో లైట్ గా ఇచ్చామంటున్నాడు నితిన్. ఈ ఎలిమెంట్ వల్ల సినిమా కొత్తగా వచ్చిందంటున్నాడు. భీష్మతో మళ్లీ గాడిలో పడతానంటున్నాడు.

"నా బాడీ లాంగ్వేజ్ కు ప్రేమకథలే కరెక్ట్ అని ఇష్క్ ముందే అనుకున్నాను. అయితే మధ్యలో కొత్తగా ఉంటుందని లై చేశాను. అది ఆడలేదు. తర్వాత మళ్లీ లవ్ స్టోరీ చేశాను. అది కూడా ఆడలేదు. తర్వాత ఫ్యామిలీ జానర్ ట్రై చేశాను. అది కూడా ఆడలేదు. ఇలా ఏ జానర్ వర్కవుట్ అవ్వకపోవడంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నాను. వెంకీ కుడుముల చెప్పిన క్యారెక్టరైజేషన్ తో మళ్లీ గాడిలో పడతానని అనిపించింది."

భీష్మ సినిమాకు సంబంధించి ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ లాంటివి ఆశించి రావొద్దంటున్నాడు నితిన్. పూర్తిగా కామెడీ ఆశించి రమ్మంటున్నాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అంటున్నాడు.

మరో 'సామజవరగమన' వస్తుందా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?