ఇది నా 11 ఏళ్ళ ఆకలి: హరీష్ శంకర్

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. దేవి శ్రీ…

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి మాసివ్ ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్

పవన్ కళ్యాణ్ ను లుంగీతో మాస్ అవతార్ లో చూపించారు దర్శకుడు. లుంగీ కట్టుకుని, బెల్ట్ వెనుక రివాల్వర్ పట్టుకుని, కాస్త తెలంగాణ మాండలీకంలో మాట్లాడుతూ ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ను కాస్త గుర్తుకు తెచ్చారు పవన్ కళ్యాణ్.

ఘంటసాల గాత్రంతో భగవద్గీతలోని శ్లోకంతో గ్లింప్స్ ప్రారంభమైంది. “భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, పాతబస్తీ” అంటూ ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ, నుదుటున తిలకంతో జీపులోనుంచి దూకుతూ ఎంట్రీ ఇచ్చారు కథానాయకుడు పవన్ కళ్యాణ్. 

కేవలం 40 సెకన్ల వీడియోలోనే తన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్, ఆవేశంతో గూజ్ బంప్స్ తెప్పించారు. “ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోయిద్ది” అంటూ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ముందే చెప్పేశారు. “హుట్ సాలే” అంటూ వింటేజ్ యాటిట్యూడ్ తో పవన్ కళ్యాణ్ పలికారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “గబ్బర్ సింగ్ మన పదేళ్ల ఆకలి తీరిస్తే.. గబ్బర్ సింగ్ నుంచి భగత్ సింగ్ వరకు ఇది నా 11 ఏళ్ళ ఆకలి. ఈ క్షణం కోసం 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ ఎగ్జైట్ మెంట్ ని ఫ్యాన్స్ తో పంచుకోవాలని, మీ సమక్షంలో గ్లింప్స్ ని విడుదల చేస్తున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకులు దశరథ్, చంద్రమోహన్, నిర్మాత ఎస్.కె.ఎన్ తదితరులు పాల్గొన్నారు.