తల్లీకూతురు.. బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ ఎంట్రీ

రాధేశ్యామ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది భాగ్యశ్రీ. దశాబ్దాల కిందట వచ్చిన ప్రేమ పావురాలు (హిందీలో మైనే ప్యార్ కియా) అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్న ఈ నటి, ఆ…

రాధేశ్యామ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది భాగ్యశ్రీ. దశాబ్దాల కిందట వచ్చిన ప్రేమ పావురాలు (హిందీలో మైనే ప్యార్ కియా) అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్న ఈ నటి, ఆ తర్వాత టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. 

ఇప్పుడు రాధేశ్యామ్ లో ప్రభాస్ కు తల్లిగా నటిస్తోంది. గతంలో తను చేసిన తప్పును ఇప్పుడు తన కూతురు విషయంలో చేయాలనుకోవడం లేదు భాగ్యశ్రీ. అందుకే కూతుర్ని ముందుగా టాలీవుడ్ కే పరిచయం చేస్తోంది.

భాగ్యశ్రీ కూతురు అవంతిక, టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది. బెల్లంకొండ గణేశ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో అవంతికను హీరోయిన్ గా తీసుకున్నారు. నాంది సినిమాను ప్రొడ్యూస్ చేసిన సతీష్ వేగేశ్న నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. చూడ్డానికి అచ్చం తల్లిలా కనిపించే అవంతిక.. బెల్లంకొండ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

స్వయంగా భాగ్యశ్రీ కథ విని ఓకే చేసిన ప్రాజెక్టు ఇది. అలా అటు రాధేశ్యామ్ తో భాగ్యశ్రీ, ఇటు బెల్లంకొండ గణేశ్ సినిమాతో అవంతిక.. ఇద్దరూ ఒకే సీజన్ లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లో ఫేమస్ అయిన భామలు చాలామంది ఉన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కత్రినాకైఫ్. కెరీర్ ప్రారంభంలో తెలుగులో సినిమాలు చేసిన కత్రినా, ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోంది. అవంతికను కూడా అదే విధంగా టాలీవుడ్ లో లాంచ్ చేసి, తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది భాగ్యశ్రీ.