మొత్తానికి టాలీవుడ్ లో గత రెండు మూడు రోజులుగా అలుముకున్న సందేహాలు తీరిపోయాయి. ఆంధ్రలో నూరుశాతం ఆక్యుపెన్సీ మీద ముసురుకున్న అనుమానాలు తొలగిపోయాయి.
రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టత లేకపోవడంతో పలు అనుమానాలు ముసురుకున్నాయి. కానీ రోజు జరిగిన టికెట్ కమిటీ సమావేశంలో అధికార వర్గాల నుంచి క్లారిటీ రావడంతో అంతా సెట్ రైట్ అయింది.
ఇప్పుడు ముందుగా అనుకున్న ప్రకారం భీమ్లా నాయక్ సినిమా 25న విడుదల అవుతుంది. వరుణ్ తేజ్ గని, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు మార్చి 4న విడుదలవుతాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కు మిగిలిన సమస్య ఒకటే. టికేట్ రేట్లు.
కొత్త రేట్లు రాకపోయినా, నూరు రూపాయల యూనిఫారమ్ రేటు కు విక్రయించగలిగితే ఫరవాలేదు. ఇప్పటి వరకు శ్యామ్ సింగ్ రాయ్ సినిమా తరువాత వచ్చిన అన్ని సినిమాలను చూసి చూడనట్లు వదిలేసారు. భీమ్లా నాయక్ విషయంలో ఏం చేస్తారు అన్నది చూడాలి.
ఆ ఒక్క సమస్య తప్పిస్తే ఇంక మరే సమస్య లేదు భీమ్లా నాయక్ విడుదలకు.